బచ్చన్నపేట, సెప్టెంబర్ 13 : బచ్చన్నపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ దేవస్థానం వద్ద బీజేపీ బచ్చన్నపేట మండలాధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకుని సేవా పక్షం కార్యక్రమాల సన్నహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి కాశెట్టి పాండు హాజరై మాట్లాడారు. మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పక్షం రోజుల పాటు రాష్ట్ర పార్టీ ఇచ్చిన వివిధ సేవా కార్యక్రమాలు, మండల కేంద్రంలో, గ్రామాలలో విజయవంతంగా నిర్వహించాలన్నారు.
అలాగే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రోజున అలాగే, మోదీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, దాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సద్ది సోమిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు గద్దరాజు, జలంధర్, మండల ఉపాధ్యక్షులు చక్రపాణి, రమేష్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్, సీనియర్ నాయకులు దొంతుల చంద్రమౌళి, పెండెం నగేశ్, బేజాడి సిద్ధులు, మండల నాయకులు తిరుపతి, రాము, రాంబాబు పాల్గొన్నారు.