లింగాల గణపురం : ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు పారదర్శకంగా అందాలనేదే ప్రభుత్వ ధ్యేయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లింగాల గణపురం మండలంలోని 39 మందికి కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ చెక్కులు, 43 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపక్షాలు ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని విమర్శిస్తున్నాయన్నారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించారన్నారు. మండలంలోని చెరువులన్నింటిని గోదావరి జలాలతో నింపి ప్రతి ఎకరాకు అందిస్తామని పేర్కొన్నారు. ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వమన్నారు. కార్యక్రమంలో తసిల్దార్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.