Jangaon : ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం

జనగామ చౌరస్తా : విదేశాలలో ఉన్నత విద్య (పోస్ట్ గ్రాడ్యుయేషన్/డాక్టోరల్) అభ్యసించే అర్హులైన మైనార్టీ విద్యార్థులు ఆన్లైన్లో డిసెంబర్ 30వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సయ్యద్ ఇస్మాయిల్ ఒక ప్రకటనలో తెలిపారు. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ వంటి దేశాలలో జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 (స్ప్రింగ్, ఫాల్ సీజన్ 2021) వరకు ఎంపికై అడ్మిషన్ పొంది ఉండాలని సయ్యద్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. www.telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ స్కాలర్షిప్ కోసం మైనార్టీ విద్యార్థిని, విద్యార్థుల వయసు అక్టోబర్ 26వ తేది 2021 నాటికి 35 సంవత్సరాలకు మించి ఉండరాదన్నారు. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ. 5లక్షలు మించి ఉండకూడదని తెలిపారు.
అదే విధంగా విద్యార్థి ఆధార్కార్డు, మైనార్టీ కుల ధృవీకరణ పత్రం, డిగ్రీ/ ఇంజినీరింగ్లో 60శాతం మార్కులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60శాతం మార్కులు పొంది పీహెచ్డీ చేయాలనుకునే వారు అర్హులు అని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయం నంబర్ 7993357081, 9951933034లను సంప్రదించాలని తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

