బీజేపీ, కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
గ్రేటర్ 15, 16వ డివిజన్ల ఎన్నికల ప్రచారంలో మంత్రి సత్యవతి
పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గీసుగొండ, ఏప్రిల్ 23: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి టీఆర్ఎస్ను ఆదరించాలని రాష్ట్ర గిరిజన స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ పరిధిలోని 15వ డివిజన్ గోపాల్‌రెడ్డినగర్, మొగిలిచర్ల, పోతురాజుపల్లిలో 15 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఆకులపల్లి మనోహర్‌తో కలిసి వారు ప్రచారం నిర్వహిచారు. సాయంత్రం 16వ డివిజన్ కీర్తినగర్కాలనీలో అభ్యర్థి సుంకరి మనీషాశివతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మంత్రి సత్యవతి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పబ్బం గడిపేందుకే టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇస్తున్నారా అని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగాలని ప్రజలను కోరారు.
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం 57 ఏళ్లకే పింఛన్లు ఇవ్వడంతోపాటు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనుందన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ నడికూడ మండలంలోని వరికోల్‌లో వంద శాతం ఓట్ల టీఆర్ఎస్కే వేశారని, మొగిలిచర్ల వాసులు కూడా వంద శాతం ఓట్లు గులాబీ పార్టీకే వేసి మరో వరికోల్గా నిలిచి సీఎం కేసీఆర్ దృష్టిలో పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, 15వ డివిజన్ ఎన్నికల ఇన్చార్జి వీరగోని రాజ్‌కుమార్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గజ్జి రాజు, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, సొసైటీ వైస్ చైర్మన్ కందుల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నర్సింగరావు, ఉజ్వల్, శ్రవణ్, రఘు, శరత్, వెంకటేశ్వర్లు, గోపాల నవీన్‌రాజు, బాబురావు, కొండా రాధ, బొట్టు శ్రీనివాస్, ఉమాదేవి, సదానందం, కేశవరెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మంటల్లో వాహనాలు..పోలీసులకు తప్పిన ప్రమాదం
బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరికలు