మహదేవపూర్(కాటారం), ఏప్రిల్ 12 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ అందరివాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాటారం మండలం సూరారం గ్రామంలో మాజీ సర్పంచ్ నాగుల లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేదర్ విగ్రహం, కాటారం మండల కేంద్రంలో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ స్తూపాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, భూపాలపల్లి మాజీ జడ్పీ చైర్పర్సన్ జకు శ్రీహర్షిణీరాకేశ్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఆవిషరించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. ఆనాడు భారత రాజ్యాంగాన్ని రాసింది అంబేదర్ అని చెప్పిన తర్వాత కూడా ఆయనను ఒక సామాజిక వర్గానికే అంటగట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎస్సీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిండని అంబేదర్ను ఎస్సీలకే పరిమితం చేయాలని చూడడం కుట్రల ఫలితమేనన్నారు. దేశంలోనే ఎకువ విగ్రహాలు అంబేదర్వే ఉన్నాయని, ఎన్ని కుట్రలు చేసినా ఆ మహనీయుడి విగ్రహాల ఏర్పాటును ఆపలేకపోతున్నారని అన్నారు.
అంబేదర్ రాజ్యాంగాన్ని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా రచించారని, కేవలం ఎస్సీలకు మాత్రమే మేలు చేస్తే బీసీ రిజర్వేషన్లు ఎలా సాధ్యమయ్యాయని, ఈనాడు 42శాతం రిజర్వేషన్లు అడిగే హకు ఎకడి నుంచి వచ్చిందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చలేదన్నారు.
విద్యార్థి దశలోనే రాజ్యాంగం గురించి తెలిసి ఉంటే మన హకులు తెలుస్తాయని, ప్రశ్నించే తత్వం వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని అన్ని భాషల్లో ఒక సబ్జెక్ట్గా చేర్చాలని డిమాండ్ చేశారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అందించడమే కాకుండా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేదర్ ను ప్రతి ఒకరూ అర్ధం చేసుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు.
అంబేదర్ అంటే అందరివాడని ఆలోచన వచ్చే విధంగా లక్ష్మీరెడ్డి తన సొంత ఖర్చుతో ప్రధాన కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్ రావు, బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కేదారి గీతాబాయి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు అలీంఖాన్, నాయకులు ప్రకాశ్, సీనియర్ బాపురావు, వెన్నంపల్లి మహేశ్, ఆల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగాల రామయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.