లింగాల గణపురం : మండలంలోని గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకంలో పారదర్శకంగా నిలవాలనే సోషల్ ఆడిట్ చేపట్టినట్టు డీఆర్డీవో వసంత తెలిపారు. లింగాల గణపురం ఎంపీడీవో కార్యాల ఆవరణలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన మండల సామాజిక తనఖీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి ఈ సంవత్సరం మార్చి 31 వరకు మండలంలో ఉపాధి హామీ పథకంలో 524 పనులు చేపట్టామన్నారు.
ఇందులో కూలీలకు నాలుగు కోట్ల 11 లక్షల రూపాయలు చెల్లించామన్నారు. మెటీరియల్‌కు రూ.27 లక్షల 17000 చెల్లించామన్నారు. మండలంలో జరిగిన నాలుగు కోట్ల 38 లక్షల పనులపై థర్డ్ పార్టీ ఎస్ఆర్పీ నాగరాజు, కాశన్న నేతృత్వంలో 9 మంది డీఆర్పీలు ఈనెల 22 నుంచి 29 వరకు గ్రామాల్లో తనిఖీలు చేపట్టారని తెలిపారు. సమావేశంలో ఏపీడీ చంద్రశేఖర్ ఏపీఓ బిక్షపతి, ఎంపీఓ రఘురామకృష్ణ పాల్గొన్నారు.