పోడు రైతులకు అండగా ప్రభుత్వం
నవంబర్ 8 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం
ఎక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లా ములుగు
పేదలకు మేలు చేసేలా రాష్ట్ర సర్కారు నిర్ణయాలు
ఓట్ల కోసమే రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలు
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
పట్టాలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం : ఎంపీ కవిత
ములుగు, జయశంకర్ జిల్లాల్లో అధికారులు, అఖిలపక్ష నేతలతో సమావేశం
ములుగుటౌన్/ భూపాలపల్లి రూరల్,అక్టోబర్ 30;‘పోడు చేసుకుంటున్న అర్హులందరికీ పట్టాలిచ్చి న్యాయం చేయడం.. అడవిని సంరక్షించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. నవంబర్ 8 నుంచి పోడు భూములపై దరఖాస్తులు స్వీకరిస్తాం.’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. ఎంపీ కవితతో కలిసి పోడు భూముల అంశంపై ములుగు కలెక్టరేట్ ఆడిటోరియం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూర్‌నగర్‌లోని ఏఎస్ఆర్ గార్డెన్లో అధికారులు, అఖిలపక్ష నేతలతో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ 2006లో అటవీ హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 6,90,059 ఎకరాలకు 2,04,176 దరఖాస్తులు రాగా 3,08,614 ఎకరాలకు సంబంధించి 96,676 హక్కు పత్రాలు ఇచ్చినట్లు వివరించారు. 3,27,880 ఎకరాలకు సంబంధించిన 91,942 దరఖాస్తులను తిరస్కరించగా 53,565 ఎకరాలకు సంబంధించిన 15,558 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 98 లక్షల ఎకరాలకుపైగా అటవీ భూమి సాగవుతోందని, వారిలో అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
పోడు వ్యవసాయం చేస్తున్న అర్హలైన రైతులందరికీ న్యాయం చేస్తామని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణపై ములుగు జిల్లా కలెక్టరేట్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూర్‌నగర్‌లోని ఏఎస్ఆర్ గార్డెన్లో శనివారం మంత్రి సత్యవతి అధ్యక్షతన అధికారులు, అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోడు చేసుకుంటున్న అర్హులందరికీ న్యా యం చేస్తూ పట్టాలు ఇచ్చి ఆ భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చుతూ అడవిని సంరక్షించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని సీఎం ఇటీవల ఒక కమిటీ వేసి ప్రతిపాదనలు ఆమోదించుకుని ముందుకు వెళ్లాలని ఆలోచన చేయడం సంతోషకరమన్నారు. న వంబర్ 8 నుంచి పోడు భూములపై క్లెయిమ్స్ స్వీకరణ ఉంటుందన్నారు. 2006లో అటవీ హక్కు చట్టం అముల్లోకి వచ్చిన తర్వాత 6,90,059 ఎకరాలకు 2,04, 176 ైక్లెమ్స్ రాగా 3,08,614 సంబంధించి 96,676 హక్కు పత్రాలు ఇచ్చారన్నారు. 3,27,880 ఎకరాలకు సంబంధించిన 91,942 క్లెయిమ్స్ తిరస్కరించగా 53,565 ఎకరాలు సంబంధించిన 15,558 క్లెయిమ్స్ పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభు త్వం వచ్చాక 98 లక్షల ఎకరాలకుపైగా అటవీ భూమి సాగులో ఉందన్నారు. పోడు చేసుకుంటున్న వారికి అన్యాయం చేయొద్దని రాష్ట్రప్రభుత్వ ఆలోచిస్తున్నదని తెలిపారు.
రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే పని చేస్తాయ ని, కానీ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి హరితహారం ద్వారా ఇన్ని చెట్లను పెంచలేదన్నారు. సరిహద్దు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి రాగానే తెలంగాణ అని తెలిసేవిధంగా చెట్లు ఉన్నాయన్నారు. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ రా జ్యాంగంలో పొందుపర్చిన విధంగా పోడు భూములను సాగు చేసిన వారికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చే ఆలోచన చేస్తుందన్నారు. ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ప్రతి ఆవాసానికి ఫారెస్ట్ రైట్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ సభ ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుందన్నారు. చట్టబద్దత హక్కు పత్రం కలిగిన ప్రతి ఒక్కరికీ హక్కు పత్రం వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో ఆర్వోఎఫ్ఆర్ చట్ట ప్రకారం 1387 మందికి హక్కు పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ఇంకా దాదాపు జిల్లాలో 15 శాతం మందికి హక్కు పత్రాలు అందలేదని చెప్పారు. వేర్వేరుగా జరిగిన ఈ సమావేశా ల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జేసీ కూరాకుల స్వర్ణలత, అదనపు కలెక్టర్లు త్రిపాఠి, దివాకర, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, డీఎఫ్‌వో ప్రదీప్ శెట్టి, డీఎఫ్‌వో లావణ్య, డీఆర్వో రమాదేవి, ములుగు జడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, గంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్ నాయక్, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.