పలిమెల, అక్టోబర్ 28 : కొవిడ్ వ్యాక్సినేషన్ పక్రియను వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని పంకెన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 3వ తేదీలోగా మండలంలో అన్ని గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. అనంతరం ఇటీవల బృహత్ పల్లె పకృతి పనులను అడ్డుకున్న రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్కు 6 ఎకరాల్లో నిర్మించేందుకు రై తులు సమ్మతించారు. డీఎంహెచ్‌వో కొమురయ్య, మండల ప్రత్యేకాధికారి భాస్కర్, ఎంపీడీవో ప్రకాశ్‌రెడ్డి, మెడికల్ అధికారి ప్రమోద్ కుమార్, సర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మట్టి వరలక్ష్మి, హెచ్‌ఈవో రమే శ్, ఈసీ నాగేందర్‌రెడ్డి, టీఏ మధుకర్ పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి..
భూపాలపల్లి రూరల్ : ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుక మాఫియా వెనుక ఎవరు ఉన్నా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
భూ సేకరణను వేగవంతం చేయండి..
భూపాలపల్లి రూరల్ : ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సింగరేణి సంస్థకు అవసరమైన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ, సింగరేణి అధికారులతో సమావేశం నిర్వహించి కేటికే-2, కేటికే-3 ఓపెన్ కాస్ట్లకు కావాల్సిసిన భూ సేకరణపై సమీక్షించారు. సింగరేణి జీఎం శ్రీనివాస రావు మాట్లాడుతూ.. కేటికే-2 ఓపె న్ కాస్ట్‌కు 97 ఎకరాలు, కేటికే-3 ఓపెన్ కాస్ట్‌కు 764 ఎకరాల భూమి కావాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇతర జిల్లాల నుంచి డిప్యుటేషన్లో ప్రభుత్వ సర్వేయర్లను జిల్లాకు తీసుకు వచ్చి భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించి కొత్తగా ఉపాధిహామీ జాబ్ కార్డులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. దివ్యాంగులకు ఉపాధి హామీ ప నుల్లో ఉపాధి కల్పించాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, అదనపు కలెక్టర్ దివాకర, ఆర్డీవో శ్రీనివాస్, డీఆర్డీవో పురుషోత్తం, జడ్సీ సీఈవో శోభారాణి, డీపీవో ఆశాలత తదితరులు పాల్గొన్నారు.