ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
భూపాలపల్లిటౌన్, అక్టోబర్28: రాష్ట్రంలో పేదింటి ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా మారారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మండలంలోని కొంపెల్లి, గొర్లవీడు, నేరేడుపల్లి, కొత్తపల్లి (ఎస్ఎం) గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఎమ్మెల్యే నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మందల లావణ్య, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి రాజిరెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, అర్బన్ మాజీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మందల విద్యాసాగర్‌రెడ్డి, సర్పంచ్‌లు కాసగాని కవిత దేవేందర్, తాటికంటి శంకరయ్య, తాళ్లపల్లి స్వామి, దానవేన రమ, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
అధికారులు బాధ్యతగా పని చేయాలి
మొగుళ్లపల్లి: గ్రామాల అభివృద్ధికి అధికారులు బాధ్యతగా పని చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్పంచ్‌లు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించి ఆదేశించారు. రైతులు రెండో పంట వేసుకోకముందే విద్యుత్ అధికారులు కరంట్ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. వారికి నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. మండల కేంద్రంలో నిర్మించిన మహాత్మా జ్యోతి భాపూలే పాఠశాలను పరిశీలించారు. విద్యార్థుల సౌకర్యాలపై ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ యార సుజాతా సంజీవరెడ్డి, సొసైటీ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు, వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, తహసీల్దార్ సమ్మయ్య పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
టేకుమట్ల: సుబ్బక్కపల్లికి చెందిన సుకంరి నిర్మలకు మంజురైన రూ.3లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో నిర్మల భర్త సుధాకర్‌కు అందజేశారు. ఈసందర్భంగా సుధాకర్ ఎమ్మెల్యే గండ్ర, సీఎం కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలిపారు.