యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతా
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
46వ డివిజన్ అభివృద్ధిపై సమీక్ష
మడికొండ, డిసెంబర్ 22 : యాదాద్రి తరహాలో మెట్టుగుట్టను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నా రు. 46వ డివిజన్ అభివృద్ధిపై బుధవారం ఆయన నివాసంలో కార్పొరేటర్ మునిగాల సరోజన, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్ట్రం లో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. మెట్టుగుట్ట నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, డైరెక్టర్ దువ్వ శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షుడు బొల్లికొండ వినోద్‌కుమార్, మునిగాల కరుణాకర్, మెట్టుగుట్ట మాజీ చైర్మ న్ అల్లం శ్రీనివాసరావు, సోషల్ మీడియా ఇన్చార్జి నర్మెటి భిక్షపతి, దువ్వ నవీన్, రాసమల్ల వెంకటస్వామి, వస్కుల దేవేందర్, మునిగాల శ్రీకాంత్ పాల్గొన్నారు.
మహిళ సంఘాల అభ్యున్నతి కృషి
ఐనవోలు : మహిళా సంఘాలు, కుల సం ఘాల అభ్యున్నతి కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని కొండపర్తిలో మహిళ సంఘా ల సమావేశ భవనం, రెడ్డి కమ్యూనిటీ భవనం నిర్మాణాలకు సీడీఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షల ప్రొసీడింగ్ కాఫీలను బుధవారం సర్పంచ్ కట్కూరి రాజమణి, వైస్ ఎంపీపీ తంపు ల మోహన్, మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కొండపర్తి ప్రజాప్రతినిధులు, మహిళ సంఘాల సభ్యులు, రెడ్డి కమ్యూనిటీ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, నాయుకులు బెన్సన్, భూపాల్‌రెడ్డి, సమ్మిరెడ్డి, యాదవరెడ్డి, కమలాకర్‌రెడ్డి, సత్తిరెడ్డి, తిరుపతిరెడ్డి, రజిని, నారాయణ, స్వామి, వీవోఏలు రహేళ, లక్ష్మి పాల్గొన్నారు.
హసన్‌పర్తిలో దుస్తుల పంపిణీ
హసన్‌పర్తి : అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవారం ఎర్రగట్టుగుట్ట కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ కానుకల పంపిణీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని సామాజిక వర్గాలకు ప్రభుత్వం ప్రధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం ఆయన సొంత ఖర్చుతో పాస్లర్లకు దుస్తులు అందజేశారు. కార్యక్ర మం లో రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ లలితాయాదవ్, ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్‌రెడ్డి, జడ్పీటీసీ సునీత, టీఆర్ఎస్ 1, 66 డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, పాపిశెట్టి శ్రీధర్, కార్పొరేటర్లు జక్కుల రజితావెంకటేశ్వర్లు, గుగులోత్ దివ్యరాణి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ అంచూరి విజయ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ జక్కు రమేశ్‌గౌడ్, మార్కెట్ డైరెక్టర్లు, చకిలం రాజేశ్వర్‌రావు, వీసం సురేందర్‌రెడ్డి, ‘కుడా’ డైరెక్టర్ రమేశ్ యాదవ్, తహసీల్దార్ నాగేశ్వర్రావు, బొడ యుగేంధర్, వొల్లాల శ్రీకాంత్, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.