మార్కెటింగ్‌కు ప్రభుత్వం చర్యలు
ఉత్పత్తుల సేకరణకు అటవీ శాఖ పూర్తి సహకారం
గుర్తింపు కార్డులు, గిరి కార్డులు ఇస్తాం
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
జీసీసీ డీజీఎం విజయ్‌కుమార్
ఏటూరునాగారం, అక్టోబర్ 22 : అటవీ ఉత్పత్తులతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా లబ్ధిపొందే అవకాశం ఉందని జీసీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని జీసీసీ బ్రాంచి కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన రెండో విడుత వన్‌ధన్ శిక్షణ కార్యక్రమంలో విజయ్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. అడవిలో లభించే ఉత్పత్తులను సేకరించి వాటికి మార్కెటింగ్ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో లభించే అత్యధిక అటవీ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసేందుకు పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. అటవీ ఉత్పత్తులతో ప్రయోజనాలు, వాటితో తయారు చేసే మందుల వివరాలను ఆయన వెల్లడించారు. ఔషధాల తయారీలో ఉపయోగించే అటవీ ఉత్పత్తులను తెలిపారు. కేవలం ఉత్పత్తుల సేకరణకే పరిమితం కాకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా మారాలని ఆయన కోరారు. ఇందుకు అవసరమైన మార్కెటింగ్‌ను జీసీసీ కల్పిస్తుందని చెపారు.
అటవీశాఖ కూడా ఇందుకు పూ ర్తి సహకారం అందిస్తుందని, ఉత్ప త్తులు సేకరించేందుకు వెళ్లే క్రమంలో అధికారు ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఉండేందుకు గుర్తింపు కార్డు ల, గిరి కార్డులు కూ డా అందజేస్తున్నట్లు తెలిపారు. బ్రాంచి మేనేజర్ దేవ్ మాట్లాడుతూ ఉత్పత్తుల సేకరణపై శిక్షణ ఇవ్వడంతో పాటు తమకు ఫలసాయం అందించే చెట్లను నరకకుండా సేకరించే అధునాతన పద్దతులపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సేకరణకు అవసరమైన అన్ని రకాల పనిముట్లను ఉచితంగా ప్రభుత్వం నుంచి అందజేస్తున్నట్లు చెప్పారు. అన్ని రకాల ఉత్పత్తులకు గిరిజన సహకార సంస్థ ద్వారా ధరలు ప్రకటించినట్లు తెలిపారు. చింత పండు, తేనె, నర మామిడి, ఎండు ఉసిరి, ఇప్పపూవు, ముష్టి గింజలు లాంటి అటవీ ఉత్పత్తులు ఎలా ఉపయోగపడుతాయో వివరించారు. వీటిపై ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చన్నారు. సేకరించిన ఉత్పత్తులను దళారులకు విక్రయించద్దని ఆయన కోరారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన గిరిజనులు, జీసీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.