పాల్గొననున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కడియం
తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం
రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు
రాయపర్తి, డిసెంబర్ 19: తెలంగాణ రైతాంగ సమస్యల పరిష్కారం-ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ సోమవారం మండలకేంద్రంలో చేపట్టనున్న ధర్నాకు అఖిలపక్ష నాయకులు రాజకీయ పార్టీలకతీతంగా తరలిరావాలని రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు గబ్బెట బాబు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధర్నాలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రైతాంగం, ప్రభుత్వంపై వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్-గ్రామ పంచాయతీ వాణిజ్య సముదాయాల ఆవరణలో ఉదయం 10 గంటలకు రైతు ధర్నా ప్రారంభం అవుతుందన్నారు. సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, పార్టీ మండల ఉపాధ్యక్షులు ఎండీ నయీం, ఉండాడి సతీశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పూస మధు, గాజులపాటి నర్మద, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, మచ్చ సత్యం, తాళ్లపల్లి సంతోష్‌కుమార్, పారుపల్లి సుధాకర్‌రెడ్డి, చందు రామ్‌యాదవ్, ఆవుల కేశవరెడ్డి, ఉస్మాన్, అక్బర్, అశ్రఫ్‌పాషా, కిరణ్, ఎల్లస్వామి, ఉపేందర్ పాల్గొన్నారు.
నేటి ధర్నాను విజయవంతం చేయాలి
వర్ధన్నపేట: యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న ధర్నా, నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ అన్నమనేని అప్పారావు కోరారు. మండలకేంద్రంలో జరిగిన నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉదయం పట్టణంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, నిరసన ర్యాలీ ఉంటుందన్నారు. మండలంలోని నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు.