నేటి ధర్నాను విజయవంతం చేయాలి
రైతులు పాల్గొనేలా చూడాలి
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
కరీమాబాద్, డిసెంబర్ 19 : రైతులు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలపై దృష్టి పెట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోరారు. రైతులకు ఇతర పంటలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఖిలావరంగల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రైతులు ఇతర పంటలను వేయాలన్నారు. రైతులకు అండగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదన్నారు. సొసైటీ సభ్యులు, అధికారులు అవగాహన క ల్పించి ఇతర పంటలు వేసేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, వైస్ చైర్మన్ సోల్తి భూమాత, ‘కుడా’ అడ్వైజరీ బోర్డు మెంబర్ మోడెం ప్రవీణ్, టీఆర్ఎస్ నాయకులు పోశాల స్వామి, బజ్జూరి రవి, ఈదుల భిక్షపతి, సీవో కుమార్, సిబ్బంది దేవేందర్, అఖిల్, సొసైటీ డైరెక్టర్లు బండి బాబురావు, తోటకూరి నర్సయ్య, బిల్ల అరేందర్, ఆవునూరి కుమారస్వామి, గద్దె కొమురమ్మ, జూలూ రి శ్రవణ్, ముప్ప సతీశ్, నోముల షణ్ముఖరెడ్డి, పసునూరి భిక్షపతి, పిన్నింటి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు వివరించాలి..
సోమవారం చేపట్టనున్న ధర్నా గురించి రైతులకు వివరించాలని ఎమ్మెల్యే నన్నపునేని ఖిలావరంగల్ పీఏసీఎస్ పాలకవర్గానికి సూచించారు. చైర్మన్ కేడల జనార్దన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా, ఆయన మాట్లాడుతూ.. ధర్నాలో నియోజకవర్గంలోని రైతులందరూ పాల్గొనేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ఎవరూ చేయని విధం గా కార్యక్రమం చేద్దామన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు పాలకవర్గం పూల మొక్కను అందజేసింది.
బాధిత కుటుంబానికి పరామర్శ..
ఇటీవల అనారోగ్యంతో మరణించిన కరీమాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు గట్టికొప్పుల స్వామి కుటుంబాన్ని ఎమ్మెల్యే నన్నపునేని పరామర్శించారు. ఆయన వెంట పల్లం రవి, కోరె కృష్ణ, పొగాకు సందీప్, ఆడెపు భిక్షపతి ఉన్నారు.
దత్త క్షేత్రంలో పూజలు..
కాశీబుగ్గ : ములుగురోడ్డులోని వరద దత్త క్షేత్రంలో పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపనేనితో పాటు మాజీ కార్పొరేటర్ రామా బాబురావు, ‘కుడా’ డైరెక్టర్ మోడెం ప్రవీణ్ ఉన్నారు.