పాలకుర్తి రూరల్, డిసెంబర్ 19: సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో పేదరికం పోవాలన్నాదే సీఎం కేసీఆర్ తపన అన్నారు. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన నడుస్త్తుందన్నారు. హిందూ ముస్లిం కిస్మస్ మతాలకు సమానంగా చూస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను కులాలను గౌరవిస్తున్నారన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని మండిపడ్డారు. మతాల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారన్నారు. బీజేపీ ఆగడాలను మాయ మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనన్నారు. పది మందికి సాయం చేసినప్పుడే దేవుడు మనకు సాయం చేస్తారన్నారు. క్రైస్తవులు సీఎం కేసీఆర్కు అండ గా నిలబడాలన్నారు. అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్ధుల్ హమీద్, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, తహసీల్దార్ ఎన్ విజయభాస్కర్, డీటీ బాశెట్టి హరిప్రసాద్, ఎంపీపీ నల్లానాగిరెడ్డి, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, వ్యవసాయ మార్కె ట్ చైర్మన్ ముస్కు రాంబాబు, టీఆర్ఎస్ మండల ప్రధా న కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, పాస్టర్లు సుదర్శన్, మోజాస్, రజిత, జరుపుల బాలూనాయక్, మేడారపు సుధాకర్, పుస్కూరి పార్వతి రాజేశ్వర్రావు, కమ్మగాని నాగన్న, బొమ్మగాని కొమురయ్య, దారవత్ బాలూనాయక్, గర్వందుల మల్లేశ్ పాల్గొన్నారు.