ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళన
టీఆర్ఎస్ భూపాపల్లి అర్బన్ అధ్యక్షుడు జనార్దన్
భూపాలపల్లి టౌన్/ చిట్యాల/ రేగొండ/ గణపురం, డిసెంబర్18: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 20న భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ధర్నా, వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ తెలిపారు. శనివారం భూపాలపల్లిలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం తీరు మారకపోతే రైతులను ఏకం చేసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 20న ధర్నా, వంటా వార్పు కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో హజరుకావాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభ రఘుపతిరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి రాజిరెడ్డి, నేతలు బుర్ర రమేశ్, బీబీ చారి, పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుదాం
చిట్యాల: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నడుం బిగించాలని జడ్పీటీసీ గొర్రె సాగర్ కోరారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షుడు ఆరెపల్లి మల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 20న మండల కేంద్రంలో నిర్వహించనున్న ధర్నాకు మండలంలోని రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్, వైస్చైర్మన్లు కుంభం క్రాంతికుమార్‌రెడ్డి, ఏరుకొండ గణపతి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, టౌన్ అధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు రవీందర్రావు, రాజేందర్, సర్పంచులు పూర్ణ చందర్రావు, పుట్టపాక మహేందర్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
రేగొండ: 20న మండల కేంద్రంలో చేపటనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్ అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
అధిక సంఖ్యలో హాజరు కావాలి
గణపురం: టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాకు నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలసాని లక్ష్మీనరసింహరావు అన్నారు. మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గుర్రం తిరుపతిగౌడ్ అధ్యక్షతనలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పోలసాని లక్ష్మీనరసింహరావు మాట్లాడారు. సమావేశంలో గణపురం పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, గణపురం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పోట్ల నగేశ్, గణపురం సర్పంచ్ నారగాని దేవేందర్‌గౌడ్, నడిపల్లి మధుసూదన్‌రావు, ఐలోని శశిరేఖ రాంచంద్రారెడ్డి, కుమారస్వామి, ఎంపీటీసీలు శివ శంకర్ గౌడ్, చెన్నూరి రమాదేవి, పోనగంటి సుందర్మ మలహల్ రావు, మంద అశోక్‌రెడ్డి, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మేకల రజిత, గణపురం ఉప సర్పంచ్ పోతర్ల అశోక్ యాదవ్ పాల్గొన్నారు.
ధర్నాకు తరలిరావాలి
మొగుళ్లపల్లి: కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం మండల కేంద్రంలో నిర్వహించనున్న ధర్నాకు అందరూ తరలిరావాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు కోరారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. సొసైటీ చైర్మన్ నర్సింగరావు, సర్పంచులు ధర్మరావు, అరవింద్‌రెడ్డి, రవీందర్రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.