లింగాలఘనపురం, డిసెంబర్ 18 : మండలంలో రెం డో విడుత వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ఎంపీడీవో సురేందర్ సూచించారు. మండలంలోని 8 గ్రామా ల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ను శనివారం పరిశీలించా రు. ఈ సందర్భంగా కొత్తపెల్లిలో ఎంపీడీవో మాట్లాడు తూ ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ విపత్తునైనా ఎదుర్కునేందుకు, ప్రత్యామ్నాయ చర్య లు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నా రు. మండలంలో వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేసి, ముందు వరుసలో ఈ మండలాన్ని నిలుపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో(టీకా) మండల స్పెషలాఫీసర్ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి సంతోషిమాత, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలున్నారు.
గ్రామాల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
బచ్చన్నపేట : మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఎంపీడీవో శివ పేర్కొన్నారు. శనివారం ఆయన మండలంలోని లింగంపల్లి, బసిరెడ్డిపల్లి తదితర గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాకరులో గా ప్రతి గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చే యాలన్నారు. ప్రతి ఒక్కరూ ఒమిక్రాన్ భారిన పడకుం డా ఉండాలంటే వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రఘురామకృష్ణ, ఆయా గ్రామా ల సర్పంచ్‌లు కుందెన మల్లేశం, పరుశరాములు, పంచాయతీ కార్యదర్శులు పరుశరాములు, రూపాచైతన్య, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో వ్యాక్సినేషన్ ముమ్మరం..
పాలకుర్తి : కొవిడ్ వ్యాక్సినేషన్ గ్రామాల్లో ముమ్మ రంగా కొనసాగుతున్నది. వ్యాక్సిన్ రెండో డోస్ ప్రతి ఒక్కరరికీ వేయాలన్న సంకల్పంతో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు శనివారం ఇంటింటికీ వెళ్లి వ్యాక్సివేశారు. కరోనా భారీ నుంచి రక్షణ కోసం రెండు డోసులు వేసుకోవాలని వైద్యాధికారులు సూచించారు. కొవిడ్ థర్డ్‌వేవ్ వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంజులారాణి, స్రవంతి, ఆశ కార్యకర్తలు సరిత, పూల మ్మ, సరిత, రసూల్‌బీ, సంతోషి, శోభ పాల్గొన్నారు.