దేవరుప్పుల, డిసెంబర్ 18: మండల కేంద్రంలోని బాలయేసు ఆంగ్ల మాద్యమ పాఠశాలలో ప్రధాన మంత్రి మోదీ పిలుపు మేర ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ పిలుపుమేర 2047లో భారత దేశం స్థితిగతులపై విద్యార్థుల ఆలోచనలు, వెలుగుకురాని స్వాతంత్య్ర సమరయోథుల గాధలు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 400 మంది విద్యార్థులు పా ల్గొని పోస్టుకార్డుల్లో వ్యాసాలు రాసి ప్రధాన మంత్రి కా ర్యాలయానికి పోస్ట్ చేశారు. నవీన భారతంలో పేదరికం లేని సమాజం, ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ఆర్థి క వ్యవస్థ, అన్ని రంగాల్లో అభివృద్ధి, విద్య, వైద్యం అన్ని వర్గాలకు ఉచితం కావాలనే ఆకాంక్షను విద్యార్థులు వ్య క్తం చేసినట్టు పాఠశాల కరస్పాండెంట్ బ్రధర్ జేసురాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఖాజా నసీరుద్దీన్, మహేశ్, భాస్కర్, అలీ, జిమ్మీ, రమాదేవి, మదన్మోహన్, రేవతి ఉన్నారు
ప్రధానికి పోస్టుకార్డుల పోస్ట్..
జనగామ రూరల్: మండలంలోని చౌడారం ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం దేశ ప్రధాన మంత్రికి పోస్టుకార్టులు రాశారు. ఆజాదీక అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలు తెలుసుకోవాల్సిన బాధ్యత రేపటి పౌరులైన నేటి విద్యార్థులందరికీ ఉందని ప్రధానోపాధ్యాయడు గాడిపల్లి రమేశ్‌బాబు అన్నారు. ఉపాధ్యాయులు ఉప్పలయ్య, సత్యనారయణ, సుధాకర్, హరిసింగ్, ఖుద్దూస్, శ్రీపివాసాచారి, సుశీల, నుజాహత్ పాల్గొన్నారు.
పాలకుర్తి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగం గా మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విద్యార్థులు పోస్ట్ కార్డులు శనివారం పంపించారు. 2047లో భారతదేశం ఎలా ఉండాలన్న అంశంపై విద్యార్ధులు తమ అభిప్రాయాలను పోస్ట్ కార్డులో రాసి పంపాపరు. భారత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని పేదరికం ఉండకూడదని అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని అందరికీ విద్య వైద్య ఉపాధి ఉద్యోగాలు అందాలని విద్యార్థులు అకాంక్షించారు. ప్రధానోపాధ్యాయుడు ఓ రమేశ్, ఉపాధాయులు వేణుగోపాల్, ఉప్పలయ్య, బలరాం, విజయకుమారి, మదన్మోహన్, సోమనాథరాజు పాల్గొన్నారు.