ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ వాపస్ చెక్కులు, రుణాల పంపిణీ
వేలేరు/ధర్మసాగర్, ఆగస్టు 18: మహిళా సంఘాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే వారికి ప్రోత్సాహకంగా వడ్డీ వాపస్ చెక్కులు అందిస్తున్నట్లు ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు, బ్యాం కు లింకేజీ, స్త్రీనిధి రుణాల వడ్డీ వాపస్ చెక్కులు ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి పంపిణీ చేశారు. 467 సంఘాల్లోని 5604 సభ్యులకు వడ్డీలేని రుణాలు రూ.3.56 కోట్లు, బ్యాంక్ లింకేజీల ద్వారా రూ.2కోట్ల 3లక్షల 50వేలు, స్త్రీనిధి ద్వారా రూ.కోటి 51లక్షల 31వేల విలువైన చెక్కులను అందజేశారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని సుష్మితగార్డెన్లో మహిళా సంఘాల సభ్యులకు రూ.14కోట్లు విలువైన వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి గ్రామంలో మహిళా సంఘాల సభ్యుల కోసం రూ.10లక్షలతో భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. వేలేరులో రూ.25లక్షలతో మండల సమాఖ్య నూతన భవన నిర్మాణానికి సహకరిస్తానన్నారు. అలాగే వేలేరు మండలానికి సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ రూ.100కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవం పెంచింది సీఎం కేసీఆరేనన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలనే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వేలేరులో ఎంపీపీ కేసిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరిత రెడ్డి, వైస్‌ఎంపీపీ సంపత్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాంగోపాల్ రెడ్డి, కుడా అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ యాదగిరి, ఆత్మ రాష్ట్ర చైర్మన్ కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, మం డల ఇన్చార్జి రాజేశ్వర్‌రెడ్డి, ధర్మసాగర్లో జడ్పీటీసీ శ్రీలత, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసకుమార్, డీపీఎంలు అనిల్, దాసు, స్త్రీనిధి రీజనల్ మేనేజర్ అశోక్, మేనేజర్ వెంకటేశ్, ఎపీఎం అనిత, వైఎస్ ఎంపీపీ రవీందర్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
దళిత బాంధవుడు సీఎం కేసీఆర్
వేలేరు : దళితబాంధవుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. దళితబంధు పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.