జనవరి 5న చివరి జాబితా విడుదల చేయండి
ఎలక్టోరల్ అబ్జర్వర్ అహ్మద్ నదీం
జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు
భూపాలపల్లి రూరల్, నవంబర్ 17 : ఓటరు జాబితాను వంద శాతం పారదర్శకంగా సిద్ధం చేయాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ అహ్మద్ నదీం అన్నారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. జెన్కో గెస్ట్‌హౌస్‌లో జిల్లా కలెక్టర్, భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల బూత్ లెవ ల్ అధికారులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించేది ఓటు హక్కు మాత్రమే అన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓట రుగా నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 2021-22 ఓటరు జాబితాను సిద్ధం చేయడాని కి ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు ఎన్నికల సం ఘం సూచించిన షెడ్యూల్ ప్రకారం అన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్‌లెవల్ ఏజెంట్లను నియమించి ఓటరు నమోదు 100 శాతం సక్రమంగా జరిగేలా భాగస్వాములు కావాలని సూచించా రు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా 5 జనవరి 2022 న చివరి ఓటరు జాబితాను విడుదల చేయాలని అన్నారు.
గరుడ యాప్‌పై అవగాహన కల్పించాలి
ములుగుటౌన్ : ప్రజలకు గరుడ యాప్‌పై అవగాహన కల్పించాలని మైనారిటీ వెల్ఫేర్ సెక్రెటరీ, ఎలక్టోరల్ పరిశీలకుడు మహమ్మద్ నదీమ్ అన్నారు. బుధవారం ఎలక్ట్రోరల్ పరిశీలకులుగా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డీఆర్వో రమాదేవి పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన తహసీల్దార్ల సమావేశంలో ఓటరు జాబితా సవరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2.15 లక్షల మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రస్తుతం స్పెషల్ సమ్మరి 2021 నడుస్తున్నాయని సోషల్ క్యాంపెయిన్, స్పెషల్ డాక్యుమెంట్‌పై అవగాహన కల్పించి ఓటర్ హెల్ప్‌లైన్‌పై ప్రచారం చేయాలన్నారు. ఫారం 6, 7, 8, 8A అవగాహన కల్పించాలని సూచించారు. పతి ఓటరు సెల్ఫ్ హెల్ప్ యాప్‌లో ఓటు నమోదు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణలో ముందుగా ఓటరు లిస్ట్ అందిస్తే డబుల్ ఓటర్స్, డెత్ కేసులు, ఒకరి ఫొటోకు బదులు మరొకరి ఫొటోలు ఏమైనా ఉంటే తమవంతు సహకారాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్లు, బీఎల్వోలు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.