ఆధునిక పద్ధతుల్లో మిర్చిసాగు
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు
ఆసక్తి చూపుతున్న రైతులు
వెంకటాపురం(నూగూరు) అక్టోబర్ 16: ఆరుగాలం కష్టించి పనిచేసే రైతన్న సాగులో అధునిక బాటపట్టి మిర్చిసాగులో దూసుకుపోతున్నాడు. కొందరు రైతులు భిన్న పద్ధతిలో సేద్యం చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతుల పాటిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగిబడులు సాధిస్తున్నారు. మల్చింగ్ షీట్, డ్రిప్ వంటి పద్ధతుల్లో మిర్చి సాగుకు ఏజెన్సీ రైతులు మొగ్గుచూపుతున్నారు. మిర్చి నాట్లకు, కోతలకు మినహా చేనులో మిగతా పనులకు ఎక్కువమంది కూలీలు అవసరంలేకుండానే రైతులు డ్రిప్ పద్ధతిలో మిర్చి పండిస్తున్నారు. ఈ పద్ధతిలో మిర్చి తోటలకు చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, ఎకరానికి సూమారు 25 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు చేబుతున్నారు. డ్రిప్ విధానంలోనే మొక్కలకు మోతాదులో ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్నారు. ఈ పనులను ఒకరు, ఇద్దరు ఉంటే సరిపోతుంది. మల్చింగ్ సీట్ విధానంతో కలుపు తీసే పని ఉండదు, రైతుకు కూలీలతో పెద్దగా అవసరం ఉండదు. మల్చింగ్ షీటు, డ్రిప్ విధానం ద్వారా ఎకరాకు రూ.30 నుంచి రూ.50 వేల వరకు ఖర్చు తగ్గుతుందని రైతులు చెబుతున్నారు.
ఆధునిక పద్ధతిలో వ్యవసాయం
మారుతున్న కాలనికి అనుగుణంగా అధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తున్నం. ఈ విధానంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయి. మిర్చి పంటలో దిగుబడులు ఎక్కువగా సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా చాలా మంది రైతులకు ఈ విదానంపై అవగాహన లేదు.
మల్చింగ్ సీట్లతో ఎంతో మేలు
మిర్చి పంట సాగుకు మల్చంగ్ సీట్లను ఉపమోగించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కూలీల సమస్య, కలుపు సమస్య ఉండటం లేదు. పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయి. మిర్చి కోతల సమయంలోనే కూలీలతోపని ఉంటుంది.అధికారులు రైతులకు ఇలాంటి విధానంపై అవగాహన మరింత పెంచాలి.