లింగాలఘనపురం, డిసెంబర్ 11 : దేశంలోఎక్కడాలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి అన్నారు. అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశానికే దిక్సూచిగా నిలిచారని పేర్కొన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక తొలిసారి ఆయన మండలంలోని నెల్లుట్ల కనకదుర్గ ఆలయానికి శనివారం వ చ్చారు. ఈ సందర్భంఆ ఆయన పూజలు చేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కడి యం శ్రీహరి విలేకరులతో మాట్లాడారు. ప్రపంచానికే రోల్‌మోడల్‌గా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులతో తెలంగాణలో లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. దీంతో ధాన్యం దిగుబడులు పెరిగాయన్నారు. కేంద్రానికి పన్నుల రూపేణా ఎక్కువ నిధులు చెల్లిస్తున్నది దేశంలో తెలంగాణ ఒక్కటేనన్నారు. సీఎం కేసీఆర్ దీవెన, స్టేషన్‌ఘన్‌పూర్ నిమోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రెండో పర్యాయం తనకు ఆరేళ్లు ప్రజలకు సేవచేసే అవకాశం లభించిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఎంఎల్సీగా ఉమ్మడి వరంగల్ జిల్లాను, ముఖ్యంగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గాన్ని రాజకీయాలకతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని శ్రీహరి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లుట్ల సర్పంచ్ చిట్ల స్వరూపారాణి భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వంగ నాగరాజు, మార్పు శ్రీనివాస్‌రెడ్డి, చౌదరపెల్లి విజయ్‌భాస్కర్, గాడిపెల్లి శ్రీనివాస్, దుంబాల భాస్కర్‌రెడ్డి, బర్ల అబ్బసాయిలు, దూసరి సోమనర్సయ్య, గండి శ్రీనివాస్, ఉంగరాల శ్రీధర్, వంచ నర్సిరెడ్డి, కారంపురి చంద్రయ్య, గొరిగె మదారు తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులకు ఆశీర్వాదం
కుందారానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు వంగ నాగరాజు-పద్మ దంపతుల కూతురు నాగజ్యోతి వివాహం అజయ్‌కుమార్‌తో ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మె ల్సీ కడియం శ్రీహరి కుందారానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వడిచర్లలో రేగు సోమయ్య, లింగాలఘనపురంలో కోడూరి వీరయ్య మరణించగా వారి కుటుంబాలను పరామర్శించారు.