ఎంపీ మాలోత్ కవిత
15 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మహబూబాబాద్/ నెల్లికుదురునవంబర్ 11 : రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకోవడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామానికి చెందిన దబ్బెట ఉమ, శంకరమంచి నాగేశ్వరశాస్త్రి, తుప్పతూరి కల్యాణితో సహా 15మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా, గురువారం మహబూబాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ కవిత వారి కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. అనారోగ్యాల బారిన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంలో ఉన్న తృప్తి చాలా సంతృప్తికరంగా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ ప్రభేత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడంలో ఎపుడు ముందుంటుందని వెల్లడించారు. పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం తాను పని చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ కో-ఆప్షన్ మహబూబ్‌పాషా, నాయకులు ముత్యం వెంకన్న, బోడ లక్ష్మణ్, నల్లాని నవీన్‌రావు, పంజాల శ్రీనివాస్, మనాది రాజేశ్,ఉగ్గ దేవేందర్, ఎండీ హిమాంపాషా, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.