ఆకర్షణీయంగా పల్లెప్రకృతివనం
అన్నిరకాల మొక్కలతో నర్సరీ
పంటలకు సూచనల కోసం రైతువేదిక నిర్మాణం
రూ.60 లక్షలతో గ్రామంలో అభివృద్ధి పనులు
కట్కూర్లో ‘ప్రగతి’ జోరు..
బచ్చన్నపేట, డిసెంబర్ 8 : మండలంలోని కట్కూర్లో పల్లెప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రూపురేఖలు మారుతున్నాయి. గ్రామంలో 2067 జనాభా ఉండగా, 597 గృహాలు, రెండు పాఠశాలలు, ఒక ఆరోగ్య ఉప కేంద్రం, రెండు అంగన్వాడీ సెం టర్లు ఉన్నాయి. వాటికి తోడు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే వసతులు, సౌకర్యాలు కల్పించారు. ఊరి చివరలో ప్రజలకు ఆహ్లాదం పంచేలా రూ. 2.50 లక్షలతో పల్లెప్రకృతి వనం, రైతులు పంటల సాగుపై మరింత రా ణించేందుకు రూ. 25 లక్షలతో రైతువేదిక, హరితహారం కోసం రూ. లక్షతో నర్సరీ, అఖరి మజిలీకి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రూ.10 లక్షలతో వైకుంఠధామం, గ్రామంలోని చెత్తను తరలించేందుకు రూ. 2.20 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు. అంతే కాకుండా గ్రామంలోని పలు వీధుల్లో రూ. 9 లక్షలతో సీసీ రోడ్లు, మురుగునీటి ఇబ్బందులు తొలగించేందుకు రూ. 9 లక్షలతో అండర్ డ్రైనేజీ నిర్మించారు. రోజు విడిచి రోజు ప్రతి ఇంటిలోని చెత్తను ట్రాక్టర్ ద్వారా డంపిండ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామం విద్యుత్ దీపాలతో మెరిసిపోతున్నాయి. సర్పంచ్ ఎం సునితారాజుగౌడ్ ప్ర త్యేకంగా విద్యుత్ స్తంభాలకు పట్నం మాదిరిగా లైటింగ్ ఏర్పాటు చేశారు. కట్కూర్ నుంచి వీఎస్‌ఆర్‌నగర్ వరకు రూ. 2లక్షలు సొంత ఖర్చులతో సోలార్ లైటింగ్ సౌ కర్యం కల్పించారు. అంతే కాకుండా గ్రామంలో రూ. 50 వేలతో హైమాస్ లైట్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా గ్రా మం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
ప్రతి వాడ శుభ్రంగా..
పల్లెప్రగతిలో భాగంగా కట్కూర్‌లోని ప్రతి వార్డు శుభ్రంగా తయారైంది. పంచాయతీ సిబ్బంది వాడలన్నీ శుభ్రం చేస్తున్నారు. ఇంటింటా చెత్తను పంచాయతీ ట్రాక్టర్లో తరలిస్తూ గ్రామాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటింటికీ మిషన్‌భగీరథ ద్వారా నల్లా కనెక్షన్ ఇచ్చి శుద్ధ్దమైన తాగునీటిని ఇంటికే సరఫరా చేస్తున్నారు. గ్రామంలోని వార్డుకో పేరు పెట్టి ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో సర్పంచ్ ప్రత్యేక కృషితో సీసీ కెమెరాలు భిగించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. వాటి ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. గ్రామాల్లోని డ్రైనీజీల్లో ప్రతి వారానికో సారి బ్లీచింగ్ పౌడర్ చల్లే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది గ్రామ పంచాయతీ.
నర్సరీ ఎదుట వాటర్ఫౌంటేన్..
మండలంలోని ఎక్కడా లేని విధంగా కట్కూర్లో నర్సరీ ఎదుట వాటర్ ఫౌంటేన్ ఏర్పాటు చేసి రంగురంగుల లైటింగ్లు అమర్చారు. చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో రాళ్లతో అందంగా, ఆకర్షనీయంగా తీర్చి దిద్దారు. పల్లెప్రకృతి వనం పచ్చని చెట్లతో కళకళలాడుతున్నది. సర్పంచ్ సునితారాజుగౌడ్ సూచన మేరకు ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ఆచార్య, కారోబార్ రాజులు వార్డులన్నీ పర్యవేక్షిస్తూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. గ్రామంలోని రోడ్లకు జట్పట్నగర్, వివేకానంద కాలనీ, వాల్మీకినగర్, కామునిపేట, చిన్నబజార్, నేతాజీనగర్, హైటెక్నగర్, ఏకలవ్య కాలనీ, అంబేద్కర్‌కాలనీ, భీరప్పకాలనీ అని నామకరణం చేసి బోర్డులు ఏర్పాటు చేసిండ్రు.
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు..
ప్రజల సహకారం, పాలకవర్గ సభ్యులు సూచనలతో దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తున్నాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వార్డు వార్డుకు నేమ్ బోర్డులు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాలు అమర్చాం.. విద్యుత్తు స్తంభాలకు సొంత ఖర్చులతో లైటింగ్ పెట్టిం చాం. ముఖ్యంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అండదండలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గ్రామం నుంచి జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారి వీఎస్‌ఆర్‌నగర్ వరకు సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయించాం. గ్రామాభివృద్ధికి వేదిక పల్లెప్రగతి కార్యక్రమం నిలుస్తున్నది.