వాడవాడలా చీరెల పంపిణీ
నర్సంపేట/నర్సంపేటరూరల్/చెన్నారావుపేట/కరీమాబాద్/గీసుగొండ/ఖానాపురం/కాశీబుగ్గ/వరంగల్ చౌరస్తా/మట్టెవాడ/నెక్కొండ, అక్టోబర్ 7: మహిళలకు బతుకమ్మ కానుకగా తెలంగాణ ప్రభుత్వం అందించిన చీరెల పంపిణీ కార్యక్రమం జిల్లాలో కొనసాగుతున్నది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అర్హులైన ఆడబిడ్డలకు పంపిణీ చేస్తున్నారు. నర్సంపేటలోని రెండో వార్డు కౌన్సిలర్ జుర్రు రాజు వార్డు పరిధిలోని మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. నర్సంపేట మండలంలోని భోజ్యానాయక్‌తండా, భాంజీపేటలో సర్పంచ్‌లు భూక్యా లలిత, పలకల పూలమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేటలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ సర్పంచ్ అనుముల కుమారస్వామితో కలిసి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కరీమాబాద్ ప్రాంతంలోని ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, వేల్పుగొండ సువర్ణ, సిద్ధం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన, ఈదురు అరుణ చీరెలు పంపిణీ చేశారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లలో కార్పొరేటర్ ఆకుల మనోహర్ బతుకమ్మ చీరెలు అందించారు. ఖానాపురం మండలంలోని బోటిమీదితండా, గొల్లగూడెంతండాలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, సర్పంచ్ గుగులోత్ తారమ్మ బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కాశీబుగ్గ ప్రాంతం 3వ డివిజన్లోని పైడిపల్లి జడ్పీఎస్ఎస్ ప్రాంగణంలో కార్పొరేటర్ షీభారాణి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. వరంగల్ 27వ డివిజన్ అబ్బనికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గిర్మాజీపేటలోని రుద్రమాంబ స్కూల్లో సూపర్వైజర్ వీ రాజు ఆధ్వర్యంలో కార్పొరేటర్ అనిల్‌కుమార్ చీరెలు పంపిణీ చేశారు. వరంగల్ 25వ డివిజన్లో కార్పొరేటర్ బస్వరాజు శిరీషాశ్రీమాన్ ఆడబిడ్డలకు చీరెలు పంపిణీ చేశారు. నెక్కొండ మండలంలోని రెడ్లవాడలో సర్పంచ్ రావుల శ్రీలతాప్రసాద్ ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ జలగం సంపత్‌రావు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.