చేనేత పరిశ్రమ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కృషి
ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
హన్మకొండ సిటీ, ఆగస్టు 7 : నేతన్నలు సృజనాత్మకతో మగ్గాలపై గొప్ప కళాకృతులను సృష్టించడం అద్భుతమని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శనివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హన్మకొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖఅతిథి పాల్గొని మాట్లాడారు. నూలు పొగులతో ఎన్నో అద్భుతాలు సృష్టించి ప్రపంచం తమవైపు చూసేలా నేతన్నలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డులు దక్కించుకుంటున్న చేనేత పరిశ్రమ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ సూచన మేరకు చేనేత వస్ర్తాలు ధరించి నేతన్నల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అనంతరం ఆయన టెస్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి చేనేత వస్ర్తాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొయినపల్లి రంజిత్‌రావు, రావుల కొమల, ఏడీ రాఘవరావు, గజ్జల శ్రీరాములు పాల్గొన్నారు.