రూ.కోటి నిధులతో జిల్లా విద్యుత్ కార్యాలయం
ప్రజల అవసరాల మేరకు సబ్ స్టేషన్లు
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
కృష్ణకాలనీ, జూలై 6 : భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కోతలు లేకుండా ప్రజలకు, రైతులకు సరిపడా కరంట్ సరఫరా చేస్తున్నదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మిలినీయం క్వార్టర్స్ ఆవరణలో విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా విద్యుత్ శాఖ అధికారులు జిల్లా కా ర్యాలయానికి భూమి కావాలని కోరడంతో వెంటనే ఎకరం భూమి కేటాయించామన్నారు. కోటి రూపాయల తో వీలైనంత త్వరగా భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కలి పి ఇప్పటికే ఆరు సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఒక సబ్ స్టేషన్ కావాలని ప్రతిపాదనలు పంపానన్నారు. అంతేకకుండా జిల్లా ప్రజల అవసరాన్ని బట్టి మరో ఆరు సబ్స్టేషన్లు మంజూరు చేపించి, జిల్లాలో లోఓల్టేజీ కరంట్ ఇబ్బందులు లేకుండా చూస్తానని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యుత్ ఉత్పత్తికి నిలయమని, జిల్లాలో ఇప్పటికే 1,100 విద్యుత్ సరఫరా కేంద్రం ఉండగా, సింగరేణి ద్వారా 20 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ వచ్చే అవకాశం ఉందన్నారు. పట్టణ ప్రగతిలో అధికారులు విద్యుత్ సమస్యలపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే
భూపాలపల్లి టౌన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్, నందిగామ, దూదేకులపల్లి గ్రామాల్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజంనగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన హ్యాండ్ వాష్ యూనిట్‌ను ప్రారంభించారు. గ్రామంలో మొక్కలు నాటి, ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గోవిందుల రాజమ్మ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామగ్రామాన పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు నిర్మిస్తున్నారని, పెండింగ్‌లో ఉన్న పనులను నెలలోపు పూర్తి చేయాలని కోరారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో డీపీవో ఆశాలత, జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభా రఘుపతిరావు, ఎంపీపీ మందల లావణ్యా విద్యాసాగర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సముద్రాల దీపారాణీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఎంపీడీవో అనీల్, ఎంపీవో నాగరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శి తాటి అశోక్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు పాలకుర్తి రఘుపతిగౌడ్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్, జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ బీబీసింగ్, డీఈ నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, టీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు, విద్యుత్ శాఖ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.