మహిళా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు
జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున
చిల్పూరు, జనగామలో మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ
చిల్పూరు, అక్టోబర్ 4 : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ఆడబిడ్డల కోసం బతుకమ్మ చీరెలు అందిస్తున్నారని జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ కోసం చిల్పూరు మండలం, జనగామ పట్టణాల్లో సోమవారం వారు మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వీటిని వినియోగించుకోవాలని కోరారు.
ఆడిబిడ్డలకు పెద్దన్న సీఎం కేసీఆర్ అని జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాజవరంలోని గ్రామపంచాయతీ ఆవరణలో సోమవారం మహిళలకు బతుకమ్మ చీరెలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంపత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగకు టీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వివరిం చారు. అనంతరం చిన్నపెండ్యాలలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, శ్రీపతిపల్లిలో సర్పంచ్ ప్రత్యూషరెడ్డి, చిల్పూరులో సర్పంచ్ ఉద్దెమరి రాజ్‌కుమార్, గార్లగండ తండాలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మాలోత్ రమేశ్‌నాయక్ నేతృత్వంలో చీరెలు పంపిణీ చేశారు.
జనగామ పట్టణంలో..
జనగామ చౌరస్తా : ఆడబిడ్డలకు పెద్దన్న సీఎం కేసీఆర్ అని జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున అన్నారు. సోమవారం పట్టణంలోని 2, 14వ వార్డుల్లో వార్డు కౌన్సిలర్లు, రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెల పంపిణీ చేపట్టారు. ఈ ముఖ్య అతి థిగా హాజరైన జమున మాట్లాడుతూ బతుకమ్మ పం డుగకు ఆడబిడ్డలకు చీరెలను కానుకగా అందిస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉండాలని కోరారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆ డపడుచుల వివాహాలకు రూ.లక్షా116 చొప్పున అం దిస్తున్నారని ఆమె వివరించారు. సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వాంకుడోత్ అనిత, పేర్ని స్వరూప, రేషన్ డీలర్ రామగల్ల మంజుల, ఆర్పీ కడారి పుష్ప తదితరులు పాల్గొన్నారు.
రంగురంగుల చీరెలు
జనగామ రూరల్ : రంగురంగుల డిజైన్లు, నేతకార్మికుల తయారు చేసిన బతుకమ్మ చీరెలను తీసుకున్న మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జనగామ మండలంలో బతుకమ్మ చీరెల పంపిణీని ప్రజాప్రతినిధులు, అధికారులు చేపట్టారు. పసరమడ్ల, శామీర్‌పేటలో ఎంపీపీ మేకల కళింగరాజు, పెంబర్తిలో జడ్పీటీసీ నిమ్మతి దీపిక, వడ్లకొండలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారద బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ తెలంగాణలో అన్ని మతాల పండుగలకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ చీరెలను ఆడపడుచుల కోసం ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, సర్పంచ్‌లు అంబాల ఆంజనేయులు గౌడ్, శివరాత్రి స్వప్నరాజు, మాండ్ర రవికుమార్ యాదవ్, ఎంపీటీసీ మూల రవిగౌడ్, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు చినబోయిన రేఖారాజు, వీఆర్ఏ దాయ ఐలమల్లయ్య, వార్డు సభ్యులు సంకటి నర్సమ్మ, భవాని పాల్గొన్నారు.
మహిళల సంక్షేమమే ధ్యేయం
కొడకండ్ల : మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీపీ జ్యోతి రవీంద్రగాంధీనాయక్ అన్నారు. సోమవారం మండలంలోని గిర్నితండాలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరెలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజ్‌కుమార్, గ్రామ కార్యదర్శి లింగయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వెంకన్న, డీలర్ రేణుక, వార్డు సభ్యులు పాల్గొన్నారు.