ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుంది
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రేగొండ, డిసెంబర్ 3 : తెలంగాణలో రైతు రాజ్యస్థాపనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలకేంద్రంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతల స మస్యలను పరిష్కరించేందుకు ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రైతు వేదికలు నిర్మించినట్లు చెప్పారు. అన్నదాతలకు సర్కా రు పెట్టుబడి సాయం అందించడంతో పాటు పండిన పంటను కూడా కొనుగోలు చేస్తుందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర 38 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్‌రావు, జడ్పీటీసీ విజయ, ఎంపీపీ లక్ష్మి, సర్పంచ్ నిషిధర్‌రెడ్డి, ఎంపీటీసీ సుమలత, ఎంపీడీవో సురేందర్, ఏవో వాసుదేవరెడ్డి, నాయకులు రాజేందర్, సంతోష్, ఉమేశ్‌గౌడ్, మహేందర్ పాల్గొన్నారు.
అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యే గండ్ర ముఖ్య అతిథిగా హాజరై వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు అందించి అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. న్నారు. సమావేశంలో ఎంపీడీవో సురేందర్, తహసీల్దార్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.