బచ్చన్నపేట, సెప్టెంబర్ 2 : మండల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభకు రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, ఎంపీడీవో రఘురామకృష్ణ, తహసీల్దార్ శైలజ, వైస్ ఎంపీపీ అనిల్‌రెడ్డి, మండల వైద్యాధికారి నవీన్‌కుమార్, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. మనవంతుగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు మంజూరు చేస్తామని, పల్లెప్రగతిలో చేపట్టిన పనులకు బిల్లులు సకాలంలో అందజేయాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నల్లాద్వారా తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించారు. ఇంకా నీటి సరఫరా కాని గ్రామాలుంటే సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అధికారులు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందేవిధంగా కృషి చేయాలన్నారు. అనంతరం పలు సమస్యలపై చర్చించి పనుల పురోగతిపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వైస్ ఎంపీపీ అనిల్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దూడల కనుకయ్యగౌడ్, ఏపీఎం జ్యోతి, పీఆర్ ఏఈ శ్రీనివాస్, ట్రాన్స్‌కో ఏఈ సత్తయ్య, ఈసీ మోహన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు.