ఎప్పుడూ పాలనా వ్యవహారాలతో బిజీగా ఉండే జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ రైతులతో మమేకమయ్యారు. మంగళవారం ఉదయం జనగామ మండలం గానుగుపహాడ్ రైతువేదికలో ‘రైతునేస్తం’ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న ఆయన మార్గమధ్యలో వడ్లకొండలో రైతు మారబోయిన బుచ్చిరాములు పొలం వద్ద ఆగారు. పొలంలోకి దిగి మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. సేంద్రియ ఎరువులు వేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.