కాజీపేట, ఏప్రిల్ 24: హనుమకొండ జిల్లాలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు నగరానికి విచ్చేస్తున్న భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాజీపేట బాపూజి నగర్లో గురువారం జాగృతి నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జాగృతి మహిళా కార్యకర్తలు బొట్టు పెట్టి, పుష్పగుచ్చం అందజేసి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో నగరానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయభాస్కర్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పాకనాటి మంజుల రావు, నూకల రాణి, జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పబ్బోజు శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.