సర్వం సిద్ధం చేసిన అధికారులు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 4 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణేశ్ నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణనాథులను శుక్రవారం సాగనంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండ ప్రాంతం లో 14 చెరువులు, వరంగల్‌లో 7 తటాకాలకు వెళ్లే రహదారుల పొడవునా విద్యుత్ లైట్లు అమర్చారు. బారికేడ్లతో పాటు 28 క్రేన్లు, తెప్పలు ఏర్పాటు చేశారు.
గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. పారిశుధ్య సేవలందించేందుకు ప్రత్యేకంగా కార్మికులను నియమించా రు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నలుగురు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 15 మంది ఏసీపీ లు, 53 మంది ఇన్స్పెక్టర్లు,70 మంది ఎస్సైలు, సిబ్బం ది మొత్తం 2100 మంది విధుల్లో ఉంటారని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీ, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా ఆంక్షలు విధించామన్నారు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, గణపసముద్రం శివారు మిషన్ భగీరథ ఫిల్టర్‌బెడ్ సమీపంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశా రు. మహబూబాబాద్‌లోని నిజాం చెరువు, ఇతర ప్రాం తాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ములుగు, ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గోదావరి బ్రిడ్జి వద్ద, మిగిలిన చోట్ల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.