మరిపెడ, జనవరి 21: మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నా యి. హర్యాన, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని షటీల్ బ్యాడ్మింటన్ ఆకాడమీల నుంచి జాతీయ స్థాయి క్రీడకారులు హాజరై పోటీల్లో తమ ప్రతిభను కనబర్చారు.
శనివారం పురుషులు సింగిల్స్ డబుల్స్ల్లో హైదరాబాద్‌కు చెందిన విక్రాంతి, ఎస్కే, జీఎస్ఆర్, హర్షసోర్ట్స్, తాడేపల్లి, రేపల్లె, విజయవాడ, దండమూరి, కార్తీక్ షటీల్ బ్యాడ్మింటన్ అకాడామీల నుంచి పలువురు క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. తొలిరోజు మెరుగైన ఆటతో ఆహుతులను అలరించారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన క్రీడకారులకు టోర్నీ నిర్వాహకులు గుడిపుడి నవీన్‌రావు, యదలాపురం అజయ్‌చారి, గోపి, ఖాదర్, పవన్, మల్లికార్జున్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆటల పోటీలు అబ్బురం : ఎంపీ మాలోత్ కవిత
జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు మరిపెడ కేంద్రం కావడం హర్షణీయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత అన్నారు. రెండు రోజులుగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా శనివారం ఆమె డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్‌తో కలిసి పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా నవీన్‌రావు ఎంపీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికి మెమోంటోతో సత్కరించారు .అనంతరం ఆమె క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ఉమ్మడి వరంగల్ జిల్లాకు తలమానికంగా ఉందన్నారు.
క్రీడకారులకు చక్కటి వేదికను ఏర్పాటు చేసి సొంత ఖర్చులతో టోర్నీ నిర్వహిస్తున్న నవీన్‌రావును ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ అరుణ, జడ్పీటీసీ తేజావత్ శారద, డాక్టర్ రవినాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామసహాయం సత్యనారాయణ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చాపల యాదిగిరిరెడ్డి, మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు అ యూబ్పాషా, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ లతీఫ్, రైతుబంధు సభ్యుడు పానుగోత్ వెంకన్న బీఆర్ఎస్ నాయకులు మాచర్ల భద్రయ్య, రేఖ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.