PN Trust | న్యూ శాయంపేట, డిసెంబర్ 10: సమాజంలోని పేదలకు అనాధలకు వికలాంగులకు పీఎన్ ట్రస్ట్ అన్ని విధాల సేవలు అందించడం అభినందనీయమని ట్రస్ట్ సభ్యుడు పుల్ల శ్రీనివాస్ అన్నారు. దర్గా కాజిపేట్ లో స్థానిక ప్రగతి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, ధీనబంధు సేవా సంస్థ ఆధ్వర్యంలో సంయుక్తంగా పేద అనాధ వికలాంగులకు ఆర్థిక, తదితర వస్తువుల పంపిణీ కార్యక్రమం ఈ సంస్థ అధ్యక్షుడు మోడం సమ్మయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అనాథలకు సేవ చేసేందుకు మనసున్న వారందరూ ముందుకు రావాలన్నారు. ధీనబంధు సేవా సంస్థ 16 ఏండ్ల నుంచి చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోలేటి వరప్రసాద్, నమిండ్ల అజయ్ కుమార్, శ్యాంసుందర్, రాసమల్ల హరీష్, నిట్ ప్రొఫెసర్లు కే కేశవ రావు, రామారావు, కునుమల్ల రాందాస్, కోశాధికారి దాగిళ్ల భాస్కర్, రాజన్ బాబు, గట్టయ్య, జలీల్ ఖాన్, వీరస్వామి, ఉపేందర్, సుధాకర్, కవి, శనిగరపు రాజ మోహన్ తదితరులు పాల్గొన్నారు.