గీసుగొండ, డిసెంబర్ 3: గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల గ్రామంలోని భక్త వీరాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కృష్ణం వందే జగద్గురు సొసైటీ రూపొందించిన 2023 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా అధ్యక్షుడు కెత్తే వీరేందర్ మాట్లాడుతూ ఏటా తమ సొసైటీ సొంత ఖర్చులతో క్యాలెండర్లను ముద్రించి భక్త వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆవిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అర్చకుడు రాజు, సభ్యులు సతీశ్, శ్రీధర్, రమేశ్, నర్సింగరావు, రాజేందర్, సాంబయ్య,రాజు,నరేశ్, విజయ్, రాజు, శ్రవణ్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో 2023 సంవత్సర క్యాలెండర్ను మండల బాధ్యులు శంకర్రావు, రాష్ట్ర బాధ్యులు దయాకర్, ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజాత, జ్యోత్స్నప్రభ, రజాక్, సంపత్రావు, నగేశ్, రఘువీర్, మాలతి, సుధాకర్, రవిచంద్ర, రాజేందర్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.