వరంగల్ చౌరస్తా: ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ ఏం.ఏ షుకుర్కు కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట్ ఆవార్డును ప్రకటించింది. బుధవారం మినిస్ట్రీ ఆఫ్ హోం ఆఫైర్స్ న్యూఢిల్లీ ఈ నెల7న విషయాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యుత్తమ సేవలు అందించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును ప్రకటిస్తూ త్వరలో అవార్డు ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి ఈ ఆవార్డు రావడం ఆనందంగా ఉందని, విధి నిర్వహణ పట్ల మరింత అంకితభావాన్ని పెంచిందని, ఈ ఆవార్డును అందుకోవడానికి సహకరించిన అధికారులకు, తోటి పోలీస్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆవార్డు ప్రకటన వెలువడగానే పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, ఉద్యోగులు, నగర ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.