నర్సంపేటరూరల్, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ఉత్తమ మహిళలను ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి శివారు బాలాజీ విద్యా సంస్థల్లో వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ కే పుష్ప హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె పిలుపునిచ్చారు.
మహిళలను అందరూ గౌరవించాలని, మహిళా అభివృద్ధితోనే కుటుంబాలు బాగుపడుతాయని చెప్పారు. మహిళలు ఆత్మరక్షణ కోసం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, హనుమకొండ అజారా ఆస్పత్రి సీఈవో తౌటి వెంకటేశ్, స్త్రీవైద్య నిపుణులు జీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పాతముగ్దుంపురం జాగృతి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ సుంకరి లావణ్యను ఉపాధ్యాయులు సన్మానించారు.
నర్సంపేట/వర్ధన్నపేట: ఎలాంటి సమస్యలు ఎదురైనా మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని సూచించారు. పట్టణంలో మున్సిపాలిటీ, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సమస్య ఎదురైనప్పుడు మహిళలందరూ ఐక్యమత్యంతో పరిష్కరించుకోవాలని కోరారు. అలాగే, నర్సంపేటలోని ఆచార్య డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ జీజుల సాగర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
సిద్ధార్థ డిగ్రీ, పీజీ కళాశాలలో గోగుల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గిరగాని సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో చిలువేరు రజినీభారతి, గుర్రపు అరుణను సత్కరించారు. కార్యక్రమంలో ఈగ సత్యనారాయణ, రవీందర్ పాల్గొన్నారు. అంతేకాకుండా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సంపేటలోని మినీ స్టేడియంలో పోటీలు నిర్వహించి ప్రథమ బహుమతి నిర్మల, ద్వితీయ బహుమతి స్రవంతి, తృతీయ బహుమతి లావణ్య, కన్సోలేషన్ బహుమతులు లలిత, హేమకు అందించారు.
ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ క్యాబినెట్ సెక్రటరీ 303 డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు సదానందం, ప్రధాన కార్యదర్శి బానోత్ శ్యామ్సింగ్, కోశాధికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వర్ధన్నపేట మున్సిపల్ పాలక మండలి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో పని చేస్తున్న మహిళా సిబ్బంది, కార్మికులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల ప్రతినిధులు కలిపి మొత్తంగా 56 మందిని మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.
ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలిసంగెం/ఖానాపురం/దుగ్గొండి/నల్లబెల్లి, మార్చి 8: మహిళలు ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలని సంగెం ఎంపీపీ కందకట్ల కళావతి అన్నారు. కుంటపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కావటి వెంకటయ్య, వార్డు సభ్యులు భాగ్యలక్ష్మి, స్వరూప, కార్యదర్శి వాజిద్, ఆశ వర్కర్లు కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్ సుజాత పాల్గొన్నారు.
ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ జీపీ కార్యాలయంలో సర్పంచ్ గొర్రె కవిత ఆధ్వర్యంలో మహిళలు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. అంగన్వాడీ టీచర్ విజయ, సీసీ కరుణ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలో మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. సర్పంచ్ల ఆధ్వర్యంలో కేక్‌లు కట్ చేశారు. గిర్నిబావిలో ఎంజేపీటీలో విద్యార్థులు ఉమెన్స్ డే ఆకృతిలో కూర్చోగా, ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్ మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. నల్లబెల్లిలో మండల వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో తహసీల్దార్ దూలం మంజులను సన్మానించారు.
నెక్కొండ/రాయపర్తి/గీసుగొండ/చెన్నారావుపేట: నెక్కొండ మండలంలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయులను పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ఘనంగా సన్మానించారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు మాలోత్ ప్రతాప్‌సింగ్, ప్రధాన కార్యదర్శి కర్ర యాకుబ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంఈవో రత్నమాలతోపాటు 60 మంది మహిళా ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందించి సత్కరించారు. కార్యక్రమంలో అలంకానిపేట హెచ్ఎం జ్యోతిలక్ష్మి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఉదయశ్రీ, కేజీబీవీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, సీఆర్పీలు, ఎమ్మార్పీలు పాల్గొన్నారు. అలాగే, నెక్కొండలోని గౌతమినగర్‌లో ఎమ్మార్పీఎస్ టీఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో వార్డు మెంబర్ ఇమాంబీని సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. అలాగే, రాయపర్తి మండలం కొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కర్ర సరిత నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు వీ సుజాత, పంతంగి స్రవంతి, జీపీ పారిశుధ్య మహిళా కార్మికురాలు గంగారపు యశోదను సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకుడు కర్ర రవీందర్‌రెడ్డి, నాయకులు వీరమనేని సత్యనారాయణరావు, పులి సోమయ్యగౌడ్, గూడెల్లి నవీన్‌కుమార్, చిలుముల స్వామి పాల్గొన్నారు. గీసుగొండ మండలం కొమ్మాలలో జీపీ మహిళా కార్మికులకు సంస్కృతి ఫౌండేషన్ చైర్మన్ రాజ్యలక్ష్మి, డైరెక్టర్ శ్రీనివాస్ సన్మానించారు. మరియపురంలో సర్పంచ్ బాలిరెడ్డి మహిళలను సత్కరించారు. కేక్ కట్ స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రణధీర్, సీసీలు శోభ, సుజాత, భవాని, హేమలత, రజిని, రమ పాల్గొన్నారు. చెన్నారావుపేటలోని పీహెచ్సీలో మహిళా ప్రముఖులను వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, సర్పంచ్ కుండె మల్లయ్య మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అలాగే మండలకేంద్రంలోని సిద్ధార్థ పాఠశాలలో మహిళా చైర్మన్ కంది విజయా గోపాల్‌రెడ్డి కేక్ కట్ చేసి మహిళా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. డీటీ మధుసూదన్, మాదిగ జేఏసీ నాయకులు తీగల అశోక్, ఎస్సీసెల్ గ్రామ అధ్యక్షుడు నర్మెట్ట సాంబయ్య, జంగిలి సదయ్య, రాజేందర్ పాల్గొన్నారు.