కాశీబుగ్గ మే20 : అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ వారోత్సవాలు 20 మే నుండి 26 మే వరకు జరుగుతున్న క్రమంలో మంగళవారం ప్రారంభ కార్యక్రమం వరంగల్ లోని కూరగాయల మార్కెట్లో జరిగింది. వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్, మార్కెట్ గ్రేట్ 2 కార్యదర్శి అంజిత్ రావు వినియోగదారులు, వ్యాపారులకు లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ.. వినియోగదారుల నిత్య జీవితంలో తూనికలు, కొలతల ప్రాధాన్యత ముఖ్య మైన అంశమని అన్నారు.
వస్తు నాణ్యతా ప్రమాణాలు పట్ల వినియోగదారుడు అవగాహన ఉన్నప్పుడే, ఆర్థికంగా జీవన శైలి బాగుంటుందన్నారు. రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్ మాట్లాడుతూ లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 లో బ్రీత్ అనలైజర్, ఎలక్ట్రిక్ మీటర్లు విధిగా చేర్చాలని అన్నారు. ఇప్పటికే సవరణలలో చేర్చిన టాక్సీ మీటర్లు, గ్లూకో మీటర్లు, మాయిశ్చరైజర్ మీటర్లు అమలులో ఉండాలని అన్నారు.
మార్కెట్ కార్యదర్శి డి. అంజిత్ రావు మాట్లాడుతూ అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ వారోత్సవాలను ఘణంగా జరుపు కోవాలని వ్యాపారులను, వినియోగదారుల ను కోరారు. నేటి కార్యక్రమంలో వినియోగదారుల మండలి రాష్ట్ర ప్రతినిధులు రావుల రంజిత్ కుమార్, నల్లా రాజేందర్, వరంగల్ హన్మకొండ జిల్లాల అధ్యక్షులు గన్నోజు నాగరాజు, గంగరాజు సతీష్, శ్రీ రామోజు శ్రీనివాస్ లు పాల్గొని తూనికలు, కొలతల లపై డెమానిస్ట్రేషన్ నిర్వహించారు.