దేశంలోనే మెగా పార్కు
రాష్ట్రప్రభుత్వం 1350 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు దేశంలోనే నంబర్‌వన్‌గా అవత రించబోతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. శుక్రవారం మండలంలోని శాయంపేట టెక్స్ టైల్ పార్కును సందర్శించారు
- 1350 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు
- ఇప్పటి వరకు రూ. 366.75 కోట్లతో మౌలిక వసతులు కల్పించాం
- ఉత్పత్తిని ప్రారంభించిన గణేశా ఇకోపెట్, ఇకోటెక్ కంపెనీలు
- త్వరలో పరిశ్రమ కారిడార్‌గా ఈ ప్రాంతం
- ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గీసుగొండ, మార్చి 24: రాష్ట్రప్రభుత్వం 1350 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు దేశంలోనే నంబర్‌వన్‌గా అవత రించబోతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. శుక్రవారం మండలంలోని శాయంపేట టెక్స్ టైల్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో ప్లాస్టిక్ బాటిల్‌తో దారం, ఫైబర్ తదిత ర ముడి సరుకులు తయారుచేస్తున్న గణేశా ఇకో పెట్, గణేశా ఇకోటెక్ పరిశ్రమను ఆయన పరిశీ లించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భూసేకరణ సమయంలో బీజేపీ నాయకులు పరి శ్రమలు కట్టరని, భూములు లాక్కుంటున్నారని గొడవలు చేశారని, రైతులు సీఎం కేసీఆర్ మీద నమ్మకంతో భూమిని ఇచ్చారన్నారు. ఇప్పటి వర కు పార్కులో రూ 366.75 కోట్లతో మౌలిక వస తులను కల్పించామన్నారు. ఇంకా పనులు జరు గుతున్నాయని తెలిపారు.
పార్కులో పరిశ్రమలకు నీటి సౌకర్యం కోసం ప్రభుత్వం రూ 12.40 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయ కులు మాత్రం పరిశ్రమలు రావడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. పార్కులో పరిశ్రమల పనులు వేగంగా జరుగుతు న్నాయని, మంత్రి కేటీఆర్ చొరవతో అనేక కంపెనీలు తరలివస్తున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అనేక సార్లు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వస్త్ర పరిశ్రమకు నిధులు కేటాయించాలని, కాళే శ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరినా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. అయిన ప్పటికీ సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో పరిశ్ర మలకు రాయితీలు కల్పిస్తూ రాష్ర్టాన్ని పారిశ్రామిక రంగంలో దూసుకెళ్లేలా చేస్తున్నాడని అన్నారు.
పార్కుకు గ్రీన్ఫీల్డ్లో అవకాశం కల్పించాలి
టెక్స్టైల్ పార్కును చూసి కేంద్రం పీఎం మిత్ర లో అవకాశం కల్పించిందని, పార్కు అభివృద్ధికి గ్రీన్ఫీల్డ్లో రూ. 500 కోట్లు మంజూరు చేయాల ని కోరారు. రాష్ట్రంలోఉన్న బీజేపీ నాయకులకు చి త్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీని ఒప్పించి నిధులు మంజూరు చేయించాలన్నారు.
పరిశ్రమల కారిడార్..
పార్కులో ఇప్పటికే గణేశా ఇకోపెట్, గణేశా ఇకోటెక్ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయని, రానున్న రోజుల్లో ఈ ప్రాంతమంతా పరిశ్రమల కారిడార్‌గా రూపాంతరం చెందుతుందన్నారు. కా ర్యక్రమంలో గీసుగొండ, సంగెం జడ్పీటీసీలు పో లీసు ధర్మారావు, గూడ సుదర్శన్‌రెడ్డి, గణేశా ఇకో టెక్ మేనేజర్ రాకేశ్చిదరి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు వీరగోని రాజుకుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, నాయకులు వేణుగో పాల్‌రెడ్డి, నరహరి, శ్రీకాంత్, ప్రమోద్, లెనిన్, అ జార్, సర్పంచులు జైపాల్‌రెడ్డి, బోడకుంట్ల ప్రకా శ్, మల్లారెడ్డి, అంకతి నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

