ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి
యువత ఉద్యోగాల కోసం వెంపర్లాడే పరిస్థితి కాకుండా ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో రూ. కోటీ 26 లక్షలతో ఏర్పాటు చేసిన ఏఐసీసీటీఈ ఐడియా ల్యాబ్‌ను రాజ్యసభ మాజీ సభ్యుడు, కిట్స్ చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
- మన చుట్టూ ఉన్న సమస్యల పరిషారానికి చదువులు, ఆవిషరణలు ఉపయోగపడాలి
- దేశాన్ని అగ్రగామిగా నిలిపేలా ఇన్నోవేషన్లు ఉండాలి
- యువతకు మంత్రి కేటీఆర్ పిలుపు
- త్రీ ఐ నినాదంతో వెళ్తేనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం
- ‘కిట్స్’లో ఏఐసీసీటీఈ ఐడియా ల్యాబ్‌కు ప్రారంభోత్సవం
హనుమకొండ సబర్బన్/హసన్‌పర్తి, మే 5: యువత ఉద్యోగాల కోసం వెంపర్లాడే పరిస్థితి కాకుండా ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో రూ. కోటీ 26 లక్షలతో ఏర్పాటు చేసిన ఏఐసీసీటీఈ ఐడియా ల్యాబ్‌ను రాజ్యసభ మాజీ సభ్యుడు, కిట్స్ చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో వినూత్న ఆవిషరణల గురించి మంత్రి కేటీఆర్ చర్చించారు.
త్రీ ఐ నినాదంతో ముందుకెళ్తే..
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ త్రీ ఐ నినాదంతో ముందుకెళ్తే ప్రపంచంలో అభివృద్ధి చెందిన ప్రథమ శ్రేణి దేశాల జాబితాలో భారత్ నిలుస్తుందని స్పష్టం చేశారు. దేశంలో మౌలిక వసతులతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందని, తాగు, సాగునీరు, రోడ్లు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రైల్వే, విద్యుత్ సౌకర్యం వంటి పలురకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దేశంలో సృష్టించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మన తల్లిదండ్రులు ఉద్యోగంలో చేరిన తర్వాత డబ్బు జమ చేసి రిటైర్మెంట్ వయసులో ఇల్లు కొనుకోవాలనే లక్ష్యంతో ఉండేవారని, ప్రస్తుత జనరేషన్ ఉద్యోగంలో చేరిన వెంటనే తమ వద్ద ఉన్న నైపుణ్యాలపై నమ్మకంతో ఈఎంఐ పద్ధతుల్లో ఇండ్లు, కార్లు కొనుగోలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. సమాజంలో వచ్చిన మార్పులకనుగుణంగా ప్రభుత్వాల్లో మార్పు ఆశించిన స్థాయిలో రాలేదన్నారు. సాంకేతికతను వినియోగిస్తూ చేసేది మాత్రమే ఇన్నోవేషన్ కాదని, మన నిత్య జీవితంలో ఉన్న సమస్యల పరిషారానికి ఇన్నోవేషన్‌ను ఉపయోగించాలని, ప్రతి రంగంలో ఇన్నోవేషన్ అవసరమవుతుందని తెలిపారు.
ఐటీ విస్తరణకు సర్కారు చర్యలు
హైదరాబాద్‌తోపాటు ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్లోనూ ఐటీ విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. యువతకు అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్, టీ వర్స్, రిచ్, వీ హబ్, టీఎస్ఐఎస్సీలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. హుస్నాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే సతీశ్, మహేందర్ అనే వ్యక్తిని పరిచయం చేశారని, మారెట్ లో రూ.1.6 లక్షల విలువ గల రోటోవేటర్‌ను ఆయన రూ.70 వేలతో తయారు చేశారని, సిరిసిల్ల జిల్లాలో వైష్ణవి అనే తొమ్మిదో తరగతి చిన్నారి తన తండ్రి ఆరోగ్యం బాగా లేదని, సిలిండర్‌ను రెండో ఫ్లోర్‌కు తీసుకెళ్లేందుకు ఓ పరికరాన్ని తయారు చేసిందని చెప్పారు. ఇలా మన చుట్టూ ఉండే నిజమైన సమస్యల పరిషారానికి మన చదువు, ఆవిషరణలు ఉపయోగపడాలని మంత్రి సూచించారు. విద్యార్థులు తమ వైఫల్యాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని, వైఫల్యం చెందిన తర్వాత వదలకుండా కృషి చేసి విజయం సాధించాలని సూచించారు.
అవరోధాలను అధిగమించాలి
సీఎం కేసీఆర్‌కు అనేక అవరోధాలు, అవమానాలు, ఆటంకాలు ఏర్పడ్డాయని, వాటిని ఎదురుంటూ నిలబడడం వల్లే తెలంగాణ సాధ్యమైందని గుర్తుచేశారు. ఆ స్ఫూర్తి విద్యార్థులందరిలో నూ ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ పీ దయాకర్, మేయర్ సుధారాణి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి, బస్వారాజు సారయ్య , ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్, దాస్యం వినయ్‌భాసర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, శంకర్‌నాయక్, నాయకులు వొడితల కిషన్‌రావు, ఇంద్రనీల్, ప్రణవ్, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, కిట్స్ ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి, రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

