గూడూరు, ఫిబ్రవరి7: మండలంలోని దామరవంచ గిరిజన గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులు విరేచనాలతో అస్వస్థతకు గురికాగా, నలుగురు స్థానిక సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గురువారం సాయంత్రం స్నాక్స్‌గా బొబ్బర గుగ్గిల్లు, రాత్రి కూర, సాంబార్‌తో అన్నం తిని పడుకున్నారు. సాయిప్రసాద్(9వ తరగతి), ల కావత్ రాహుల్, బానోత్ అనిల్, బానోత్ యాకూబ్ కు విరేచనాలు కావడంతో తెలుగు టీచర్ గమనించి శుక్రవారం ఉదయం దవాఖానకు తరలించారు. వెం టనే వైద్యుడు వీరికి చికిత్స అందించడంలో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి శ్రీనివాసరావు ఆశ్ర మ పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఆరోగ్యంగా నే ఉన్నారని, నలుగురికి మాత్రమే విరేచనాలు అవుతున్నాయని, కారణం తెలుసుకుంటామని తెలిపా రు. దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే మురళీనాయక్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
గూడూరు, ఫిబ్రవరి7: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, అన్ని వసతులు కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. దామరవంచ గురుకు ల పాఠశాలను సందర్శించి, వంటగది, ఆహార పదార్థాలు, సామగ్రి, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం సిబ్బంది, ఉద్యోగులు, విద్యార్థులతో మాట్లాడుతూ వంటగదిలో శుభ్రత పాటించాలని, విద్యార్థులకు సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. నాయకులు దేవేంద్రాచారి, మంగీలాల్, రామన్ననాయక్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ 14నెలల పాలనలో సంక్షేమ హాస్టల్లో 50 మందికి పైగా విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. విద్యార్థులకు ఉడికీ ఉడకని పుచ్చులు కలిగిన స్నాక్స్ గుగ్గిల్లు(గుడాలు) ఇచ్చారు. ఇది సర్కారు నిర్లక్ష్యమే. నాణ్యతలేని ఆహారం కారణంగా విద్యార్థులు ప్రాణాలమీదికి తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు, నాణ్యమైన ఆహారం సమకూర్చాలి. ప్రభుత్వ అధికారులతో పాటు మంత్రులు శ్రద్ధ తీసుకుని హాస్టల్ బాటపట్టాలి.
ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా, పాలన జరుగుతున్నదా?. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరు. కేవలం కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికైనా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, విద్యార్థుల సంక్షేమం, విద్య, వైద్యం కోసం ప్రభుత్వం చొరవ చూపాలి. లేకుంటే ఆందోళనలు చేస్తాం. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ ఆరె వీరన్న, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, నాయకులు బోడ కిషన్, రహీం, బెజ్జం రమేశ్, నర్సింహానాయక్, మన్మోహన్రెడ్డి, చందర్ పాల్గొన్నారు.