సుబేదారి, మే 21 : హనుమకొండ జిల్లాలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నా యి. ప్రభుత్వ స్థలాలు గుట్టలు, చెరువులు, అసైన్డ్ భూములను లూటీ చేస్తున్నారు. భారీ మిషన్లతో రాత్రికి రాత్రే అడ్డగోలుగా తవ్వేసి, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రహదారుల నిర్మాణం పేరుతో కొన్ని నిర్మాణ సంస్థ లు అక్రమంగా గుట్టల నుంచి మొరం తవ్వకాలు జరుపుతున్నాయి. లీజ్ పేరుతో క్వారీ ల యజమానులు టిప్పర్ల ద్వారా కెపాసిటీకి మించి రవాణా చేస్తున్నారు. కొన్నిచోట్ల రా త్రి వేళల్లో అనుమతులు లేకుండా గుట్టలు, చెరువులు, అసైన్డ్ భూముల నుంచి జేసీబీలతో మొరం తవ్వకాలు జరుపుతున్నారు. ఇంత జరుగుతున్నా గనులు, భూగర్భ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. స్థానికుల నుంచి జిల్లా ఉన్నతాధికారులు, గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు వచ్చినప్పుడే ఆ శాఖ అధికారుల్లో కదలిక వచ్చి, నామమాత్రంగా విచారణ చేసి, జరిమానాలు వేస్తున్నారు. కానీ, బాధ్యులతో జరిమానా డబ్బులు మాత్రం కట్టించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దామెర మండలం ల్యాదెళ్ల గ్రామ సమీపంలోని ప్రభుత్వ గుట్టల నుంచి లీజ్ పేరు తో రెండు స్టోన్ క్రషర్స్ కంపెనీ యజమానులు అడ్డగోలుగా మొరం తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు ఒక్కో టిప్పర్‌లో ఓవర్ లోడింగ్ 25 టన్నులకు రూ.5 వేల నుంచి రూ. 6 వేలు క్వారీ యజమానులకు చెల్లించి నగరానికి మొరం రవాణా చేస్తున్నారు. ఈ విషయంలో 3 నెలల క్రితం విజిలెన్స్ అధికారు లు సదరు టిప్పర్లకు జరిమానా విధించారు. అయినా ఓవర్ లోడింగ్తోనే టిప్పర్లలో మొరం రవాణా జరుగుతున్నది. దీంతో పరిసర గ్రామాల రోడ్లు దెబ్బతింటున్నాయి. ఓవర్ లోడింగ్‌తో టిప్పర్లు వెళ్తుంటే దుమ్ము, ధూళిని భరించలేకపోతున్నామని, రాత్రి వేళ నడిచే మొరం టిప్పర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయిని స్థానికులు వాపోతున్నారు. అలాగే నడికూడ మండలం కౌకొండ, కంఠాత్మకూర్ గ్రామాల శివారు ప్రభుత్వ గుట్టల నుంచి రహదారుల నిర్మాణం పేరుతో ఓ నిర్మాణ సంస్థ పెద్ద మొత్తంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరిపి ఆ ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చింది. ఇక్కడ దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల నుంచి మొరం తవ్వకాలు జరుపుతున్నారు.
ఇది ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో గనులు, భూగర్భ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి రూ.2.67 కోట్ల జరిమానా విధించారు. అలాగే కమలాపూర్ సమ్మక్క గుట్ట నుంచి అక్రమంగా మొరం తవ్వకాలు జరిపిన ఇద్దరు వ్యక్తులకు రూ.72లక్షల జరిమానా విధించారు. అయితే బాధ్యుల నుం చి ప్రభుత్వ ఖజానాకు మాత్రం జరిమానా కట్టించలేదు. కాగా, ప్రభుత్వ స్థలాల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన మైనింగ్ అధికారులు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో మొరం మాఫియా రెచ్చిపోతున్నది. అడ్డగోలుగా రాత్రి సమయాల్లో తవ్వకాలు జరుపుతున్నది. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై ఆవినీతి ఆరోపణలున్నాయి. విచారణ క్రమంలో మట్టి తవ్వకాలు జరిపిన వారి నుంచి బేరసారాలు మాట్లాడుకొని, తక్కువ జరిమానా విధిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.