Narayanapet | మాగనూరు, జూన్ 14 : రాత్రి వేళలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకున్న ఘటన మాగనూరు మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై అశోక్ బాబు వివరాల మేరకు మాగనూరు వాగు నుండి రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను టాస్క్ ఫోర్స్, మాగనూరు పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి, సీజ్ చేశారు.
మాగనూరు రోడ్ క్యాంపు సమీపంలో ఒకటి, రెండో టిప్పర్ మాగనూరు ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారని ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు. ఇవి రాత్రి వేళలో ఎలాంటి పర్మిషన్ లేకుండా తరలిస్తున్న మాగనూరు మండలం వర్కూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ రాము, ఓనర్ లింగప్ప, మాకనూరు మండలానికి చెందిన డ్రైవర్ రమేష్, ఓనర్ వినోద్ కుమార్‌పై కేసు నమోదు చేయడం జరిగిందని మాగనూరు ఎస్సై అశోక్ బాబు తెలిపారు. అక్రమంగా రాత్రి వేళలో ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై అశోక్ బాబు తెలిపారు.