KTR | వచ్చే ఐదేళ్లు చిట్టినాయుడు అండ్ టీంకు సినిమా చూపెట్టే బాధ్యత నాది : కేటీఆర్
KTR | ఐదేళ్లు ఏదీ మర్చిపోము. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని మర్చిపోం.. మన మీద కేసులు పెట్టినోడిని మరిచిపోం. మనతో నిలబడినోళ్లను కూడా మరిచిపోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వర్దన్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తోపాటు నియోజకవర్గానికి చెందిన నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
KTR | వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తోపాటు నియోజకవర్గానికి చెందిన నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లు ఏదీ మర్చిపోము. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని మర్చిపోం.. మనమీద కేసులు పెట్టినోడిని మరిచిపోం. మనతో నిలబడినోళ్లను కూడా మరిచిపోమన్నారు.
తప్పకుండా చెప్తున్నా.. నేను కేసీఆర్ సారంతా మంచోన్నైతే కాదు. వచ్చే ఐదేళ్లు చిట్టినాయుడుకు ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది.. పక్కా విడిచిపెట్ట. రిటైరైనా పారిపోయినా సప్తసముద్రాల అవతల దాక్కున్నా.. ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కడిని వెతికి తెచ్చి మీ ముందట నిలబెట్టే బాధ్యత నాది.. వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. ఇది నేనేం ఊరికే చెప్పడం లేదు.. గుర్తు పెట్టుకోండి. కానీ రమేశన్న (ఆరూరి రమేశ్) వీడు మంచోడేనే అన్నా అని మళ్లా వారిని తీసుకొని రావొద్దని కేటీఆర్ సూచించారు.
వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది
మా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ఒక్కొక్కడిని రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాలు దాటినా లాక్కొచ్చి నిలబెడతా – కేటీఆర్ pic.twitter.com/mrTtUtnuiO
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2026
Read Also :
Maa Inti Bangaram | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’.. రెండు రోజుల్లో రూ.25 కోట్లకు పైగా వసూళ్లు!
Baahubali Docuseries | ‘బాహుబలి’ తెరవెనుక కథ.. జూన్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ సిరీస్
Tandur | తాండూర్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

