మహబూబాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో జరిగిన నష్టంపై అధికారులు తుది నివేదిక సిద్ధంచేశారు. ఈమేరకు గురువారం రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తమ నివేదికలను కలెక్టర్కు సమర్పించారు. ఆర్అండ్బీ పరిధిలో జిల్లావ్యాప్తంగా 52చోట్ల రోడ్లు తెగిపోగా 189 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. వీటికి గా ను తాతాలిక మరమ్మతుల కోసం రూ.6 కోట్లు, శాశ్వత నిర్మాణాల కోసం రూ. 177.70 కోట్లు అవసరమని నివేదించారు.
అలాగే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 96 చోట్ల రోడ్లు తెగిపోగా, మరికొన్ని చోట్ల దెబ్బతిన్నాయి. వీటికి తాతాలిక మరమ్మతుల కోసం రూ.3.5 కోట్లు అవసరమని, శాశ్వత నిర్మాణాల కోసం రూ.60 కోట్లు కావాలని నివేదిక సమర్పించారు. ఆర్అండ్బీ పరిధిలో 10 చోట్ల బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని ఇందుకోసం రూ.5 కోట్ల వరకు నిధులు అవసరమని ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు నివేదించాయి. అలాగే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 74 చోట్ల బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని ఇందుకోసం రూ.20 కోట్ల వరకు శాశ్వత నిధులు అవసరమని నివేదించారు.
జిల్లావ్యాప్తంగా 610 పూర్తిగా నేలమట్టం అయ్యాయి. అతి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదతో మరిపెడ మండలం ఉల్లేపల్లి, సీతారాంతండా, నెల్లికుదురు మండలం రావిరాల, డోర్నకల్ మండలం దుబ్బతండా తదితర ప్రాంతాల్లో 1,180 ఇండ్లు నీటిలో మునిగాయని వీరికి ఇంట్లోని వస్తువులు కొ ట్టుకుపోగా, మరికొంత తడిసి ముద్దయ్యాయని నివేదిక సమర్పించారు.
ఎన్పీడీసీఎల్కు రూ.3.50 కోట్ల నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 2,189 విద్యు త్ స్తంభాలు, 312 ట్రాన్స్ఫార్మర్లు, 170 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు దెబ్బతిన్నట్లు విద్యుత్ అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు.