మహదేవపూర్ (కాళేశ్వరం) మే 24 : సరస్వతీ పుషరాల పదో రోజు కాళేశ్వరానికి భక్తజనం పోటెత్తారు. ఈ నెల 15న ప్రారంభమై మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో తెలంగాణ సహా వి విధ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో త్రివేణి సంగమం కోలాహలం మారిం ది. శనివారం ఒక్కరోజే సుమారు 5లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. సరస్వతీ(వీఐపీ) ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పుణ్యస్నానం ఆచరించి చీరె, సారె సమర్పించారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీతో గోదావరి కిటకిటలాడింది. ఇక స్వామివారి దర్శనానికి భక్తులకు గంటల సమయం పట్టింది. పలువురు భక్తులు క్యూలైన్లో సొమ్మసిల్లి పడిపోగా, వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. ఆలయ ఆవరణలో విధులు నిర్వర్తిస్తున్న ఓ హోంగార్డ్‌కు ఫిట్స్ వచ్చి కిందపడిపోయాడు. అకడే ఉన్న ఫైర్అండ్ రెస్క్యూ సిబ్బంది దవాఖానకు తరలించారు.
10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
సరస్వతీ పుషరాలు మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో భక్తులు ప్రైవేట్ వాహనాల్లో కాళేశ్వరానికి చేరుకుంటున్నారు. దీంతో కాళేశ్వరం నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామైంది. చాలామంది భక్తులు ట్రాఫిక్‌లో ఇరుక్కొని నరకయాతన పడ్డారు. క్షేత్రానికి వచ్చే వాహనాలను మూడు కిలోమీటర్ల ముందే నిలిపివేయడంతో భక్తులు అకడి నుంచి కాలినడకన ఆలయానికి చేరుకున్నారు.
ఈ రెండు రోజులే కీలకం : కలెక్టర్ రాహుల్ శర్మ
సరస్వతీ పుషరాలకు ఈ రెండు రోజులే కీలకమని, లక్షల్లో భక్తులు వచ్చే అవకాశమున్నందున యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. పుషరాల ఏర్పాట్లను పరిశీలించి, రానున్న రెండు రోజులు చేపట్టాల్సిన చర్యలపై వాకీటాకీ ద్వారా దిశానిర్దేశం చేశారు. మెయిన్ ఘాట్ నుంచి సరస్వతీ ఘాట్ వరకు ఏర్పాటు చేసిన మట్టి రోడ్డులో వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలన్నారు.
అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయానికి చేరుకొని, భక్తుల రద్దీని పరిశీలించి పుషరాల సేవలు ఏవిధంగా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. పలుగుల జంక్షన్, తాతాలిక బస్టాండ్, ఇప్పలబోరు జంక్షన్, పారింగ్ స్థలాలను పరిశీలించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులతో మాట్లాడారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్నందున అత్యవసర వైద్య సేవలకు అంబులెన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం త్రివేణి సంగమంలో పడవలో ప్రయాణించి రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, సరస్వతీ పుషరాలకు ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రాఫిక్‌తో ఇబ్బందిపడ్డాం..
టేకుమట్ల : భక్తుల రాకను అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో ట్రాఫిక్‌లో ఇరుక్కొని ఇబ్బందిపడ్డాం. నియంత్రించాల్సిన పోలీసులు చెట్ల కిందే సేదతీరడం దారుణం. కొందరు భక్తులే వాహనాలు దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సి వచ్చింది. వృద్ధులు, చిన్నారులకు తాగునీరు అందక నరకయాతన పడ్డారు. చాలా మంది వాహనాలను వదిలి 10కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు.
– నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, భక్తుడు, బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా