బయ్యారం, ఏప్రిల్ 14 : నూతనంగా నిర్మించిన ఇంటికి లక్షల్లో పన్ను వచ్చిన ఘటన బయ్యారం పంచాయతీ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. బయ్యారం మెయిన్ రోడ్ సెంటర్ వద్ద వై నరసింహారావు నూతనంగా ఇంటిని నిర్మించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటి నంబర్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారం రోజుల క్రితం నంబర్ మంజూరైంది. రూ.58,50,003 పన్ను వచ్చినట్లు డిమాండ్ నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటి పన్నుల వసూలు మండలంలో 90 శాతం నుంచి 40 శాతానికి పడిపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు ఆన్లైన్లో డేటా పరిశీలించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ విషయంపై ఆరా తీసిన జిల్లా అధికారులు సంబంధిత సెక్రటరీల ప్రమేయం లేకుండా ఇంటి నంబర్ మంజూరైనట్లు ప్రాథమికం గా గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంపై ఎం పీవో చంద్రమోహన్‌ను వివరణ కోరగా విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.