నయీంనగర్, జూలై 25 : చదివింది ల్యాబ్ టెక్నీషియన్.. కానీ మడికొండ మెయిన్ రోడ్డులో సాయిశ్రీఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరుతో భార్యాభర్తలు హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం(టీజీఎంసీ) దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్బంగా టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్‌కుమార్ మాట్లాడుతూ..
ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఇష్టారీతిన క్లినికల్ ఎష్టాబ్లిష్మెంట్ చట్టాలకు విరుద్ధంగా హాస్పిటల్ వలె బెడ్లు, ఐవీ స్టాండ్, ల్యాబ్ నిర్వహిస్తూ అశాస్త్రీయ పద్ధతుల్లో రోగులకు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, మలేరియా ఇంజక్షన్లు ఇస్తున్నారని, డాక్టర్ల వలె ప్రిస్రిప్షన్స్ రాస్తునట్లు గుర్తించామన్నారు. అంతేకాకుండా తాను లా చదివాను అంటూ భాగ్యలక్ష్మి అధికారులపై దురుసుగా ప్రవర్తించిందన్నారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న భాగ్యలక్ష్మి, అనుమతి లేని సర్టిఫికెట్ కోర్సులతో హాస్పిటల్ నిర్వహిస్తున్న జయరాంపై త్వరలోనే అధికారికంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మడికొండలోని హైదరాబాద్ హైవేలో శ్రీజ క్లినిక్ ఏర్పాటు చేసి ఇంటర్ ఫెయిలైన రాజు తాను డాక్టర్ అని పేరొంటూ ప్రిస్రిషన్స్ రాస్తున్నాడని, ఫేక్ రిజిస్ట్రేషన్ నంబర్ రాసి, ఇంజక్షన్లు కూడా ఇస్తునట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అనధికారికంగా అల్లోపతి వైద్యం చేస్తున్న జయరాం, భాగ్యలక్ష్మి, రాజుపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో హెచ్ఆర్డీఏ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు డాక్టర్ వెంకట స్వామి ఉన్నారు.
హనుమకొండ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ డీ అడిక్షన్ సెంటర్ నిర్వాహకుడు రాము తాను డాక్టర్ అంటూ ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ లాలయ్య కుమార్ ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేశ్‌కుమార్ తెలిపారు. ఎవరైనా వ్య క్తులు అర్హత లేకుండా డాక్టర్ అని బోర్డులు పెట్టి అ ల్లోపతి వైద్యం చేస్తే చట్ట ప్రకారం సంవత్స రం జైలు శిక్ష, రూ.5లక్షల వరకు ఫైన్ విధిస్తారని తెలిపారు.