నల్లబెల్లి, మే12 : పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఉచితంగా స్థలాన్ని ఇచ్చిన స్థలదాతను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ మేరకు నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఏర్పాటులో భాగంగా సోమవారం సుదర్శన్‌రెడ్డి ఆలయాన్ని సందర్శించారు.
స్థలదాత సురబోయిన రాంబాబును సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ తోపాటు మండల క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.