వరంగల్ లీగల్, మార్చి 8: ఒకప్పుడు గ్రామా ల్లో సమస్యలు వస్తే కుల, గ్రామ పెద్దలు పరిష్కరించే వారని, ఇప్పుడు కూడా ప్రతి చిన్న తగాదాకు కోర్టు, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా వారి మధ్యలో పరిషరించుకుంటే డబ్బుతో పాటు సమయం వృథా కాదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ పేరొన్నారు. అందుకోసమే కమ్యూనిటీ మధ్యవర్తిత్వ చట్టం వచ్చిందన్నారు. శనివారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ‘కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్’పై నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో సుజయ్ పాల్ హాజరై మాట్లాడారు.
కమ్యూనిటీ మధ్యవర్తిత్వ కేం ద్రంలో మధ్యవర్తులుగా ఉండే కుల పెద్దలు శిక్షణ పొంది ఉంటారని, అందువల్ల ఇరుపక్షాలు పరస్ప ర ఆమోదయోగ్యమైన రీతిలో వివాదాన్ని పరిషరించుకొనే వీలుంటుందన్నారు. కమ్యూనిటీ మధ్యవర్తిత్వ కార్యక్రమం అన్ని గ్రామాల్లో అమలవుతుందన్నారు. మధ్యవర్తులుగా పనిచేసేందుకు వరంగల్ జిల్లా నుంచి అన్ని కులాల పెద్దలు, అనుభవజ్ఞులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపినందుకు చీఫ్ జస్టిస్ కృతజ్ఞతలు తెలిపారు.
మరో హైకోర్టు న్యాయమూర్తి కే లక్ష్మణ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 5.30కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయని, ఇం దులో రాష్ట్రంలో 9 లక్షలున్నాయన్నారు. ఎలాంటి ఒత్తిడికి తావివ్వకుండా లోక్ అదాలత్‌లో కేసులు పరిషరించాలని ఆయన సూచించారు. ఆన్లైన్ ద్వారా జస్టిస్ మౌసమి భట్టాచార్య మాట్లాడుతూ వరంగల్ వేదికగా లోక్ అదాలత్ ప్రారంభం కావడం అభినందనీయమన్నారు. లోక్ అదాలత్‌లో కౌన్సెలింగ్ ద్వారా సమస్య పరిష్కరించుకున్న భార్యా భర్తను పిలిచి న్యాయమూర్తులు మళ్లీ పూలదండలు మార్పించారు.
కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేవ్బాబు, మెంబర్ సెక్రెటరీ సీహెచ్ పంచాక్షరి, వరంగల్, హనుమకొండ, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, పీ ప్రావీణ్య, డాక్టర్ టీఎస్ దివాకర, షేక్ రిజ్వాన్ బాషా, అద్వైత్ కుమార్‌సింగ్, రాహుల్ శర్మ, వరంగల్ సీపీ అంబర్ కిషోర్‌ఝా, మానుకోట, భూపాలపల్లి ఎస్పీలు సుధీర్ రామ్‌నాథ్ కేకన్, కిరణ్‌ఖరే, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు టీ జీవన్ గౌడ్, ఎం రమేశ్‌బాబు, బార్ కౌన్సిల్ మెంబర్ సిరికొండ సంజీవరావు, వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.